నెల్లూరు ఆ ఎమ్మెల్యేలకు జగన్ షాక్..సీటు లేనట్లే.!

-

గత ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు కేవలం జగన్ గాలిలోనే గెలిచిన విషయం తెలిసిందే. జగన్ గాలిలో గెలిచిన సరే ఎమ్మెల్యేలుగా ప్రజలకు సేవ చేస్తుంటే..వారికి ప్రజా బలం పెరుగుతుంది. అప్పుడు జగన్ సపోర్ట్ తో పాటు సొంత బలంతో గెలవగలరు. కానీ అంతా జగన్ చూసుకుంటారని చెప్పి..ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలకు ఏమి చేయకపోతే..జగనే వారిని పక్కన పెట్టడం ఖాయం.

ప్రజా వ్యతిరేకత పెంచుకున్న ప్రతి ఎమ్మెల్యేని పక్కన పెట్టేస్తానని జగన్ ఇప్పటికే క్లారిటీగా చెప్పేశారు. ఇదే క్రమంలో వైసీపీ కంచుకోట లాంటి జిల్లా నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పుడుప్పుడే అక్కడ టి‌డి‌పి బలపడుతుంది. ఇటు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఇదే కంటిన్యూ అయితే నెల్లూరులో వైసీపీ సత్తా చాటలేదు. అందుకే ఈ సారి కూడా సత్తా చాటాలంటే అక్కడ ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలని మార్చాలని తెలుస్తోంది.

అందులో మొదటగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్…అసలు ఈయన ఎమ్మెల్యేగా గూడూరుకు చేసింది ఏమి లేదని టి‌డి‌పి వాళ్ళు కాదు..సొంత పార్టీ వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. పైగా అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపణలు చేస్తున్నారు.  అసలు నెక్స్ట్ సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. అంటే ఎమ్మెల్యే వరప్రసాద్ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఈ సారి గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్‌ని పక్కన పెట్టడం ఖాయమని తెలుస్తోంది.

ఇటు సూళ్ళూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యపై కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవ‌ల వైసీపీ మ‌హిళా ఎంపీటీసీ డైరక్ట్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో పెట్టడం, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఎమ్మెల్యేగా కూడా ఆయన పనితీరు పట్ల సొంత పార్టీ వాళ్ళే సంతృప్తిగా లేరు. ఆయన్ని పక్కన పెట్టేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సంజీవయ్యని కూడా సైడ్ చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news