జగన్ సంచలనం..మళ్ళీ ఒకేసారి లిస్ట్?

-

మళ్ళీ గెలవడానికి జగన్ అభ్యర్ధుల లిస్టుని పకడ్బంధిగా ప్రిపేర్ చేస్తున్నారా? గెలుపు గుర్రాలని రెడీ చేసి..ఒకేసారి లిస్టు విడుదల చేస్తారా? అంటే అవుననే చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో..2014లో చేసిన తప్పులని జగన్ చేయలేదు. అభ్యర్ధుల విషయంలో పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు. 2014లో అభ్యర్ధుల విషయంలో కాస్త మొండిగా ముందుకెళ్లారు. ఇచ్చిన మాట కోసమని చెప్పి..బలం లేకపోయినా సరే కొంతమందికి సీట్లు ఇచ్చారు. అలాగే సీట్లు ఎడాపెడా మార్చేశారు. దీని వల్ల వైసీపీకి నష్టం జరిగింది. అధికారంలోకి రాలేదు.

2019 ఎన్నికల్లో అలా చేయలేదు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో  టి‌డి‌పిని దెబ్బతీస్తూనే..వైసీపీ నుంచి బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. ఎడాపెడా నియోజకవర్గాలు మార్చలేదు. అలా చేయడంతోనే 2019 ఎన్నికల్లో గెలుపు సాధ్యమైంది. పైగా ఒకేసారి 175 అభ్యర్ధుల లిస్ట్‌ని జగన్ విడుదల చేశారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. అసంతృప్తులకు ముందుగానే సర్ది చెప్పి లిస్ట్ రెడీ చేశారు. కానీ చంద్రబాబు అలా చేయలేదు. ఎడాపెడా అభ్యర్ధుల్ని మార్చారు..విడతల వారీగా లిస్ట్ ఇచ్చారు. దీంతో టి‌డి‌పికి నష్టం గట్టిగానే జరిగింది.

అయితే మళ్ళీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్న జగన్…ఈ సారి కూడా అభ్యర్ధుల విషయంలో పక్కాగా వెళుతున్నారు. పైగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. దీంతో కొందరు సిట్టింగులని జగన్ పక్కన పెట్టడం ఖాయమని తెలుస్తుంది. ఆ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని జగన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో నేతలకు హింట్ ఇచ్చారని తెలిసింది.

అటు టి‌డి‌పి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో కూడా వైసీపీ నుంచి బలమైన అభ్యర్ధులని రెడీ చేస్తున్నారు. మొత్తానికి ఒకేసారి అభ్యర్ధుల లిస్ట్ విడుదల చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారని తెలిసింది. అది ఎన్నికలకు మూడు నెలల ముందే ఉంటుందని సమాచారం..అక్టోబర్ తర్వాత అభ్యర్ధుల లిస్ట్ రెడీ చేసే పనిలో ఉంటారని తెలిసింది. చూడాలి మరి ఈ సారి జగన్ సక్సెస్ అవుతారేమో.

Read more RELATED
Recommended to you

Latest news