ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఏ స్థాయిలో ఉందోచూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి టైమ్‌లో రాష్ట్రాలు టీకాల ఉత్పత్తి కోసంగ్లోబల్ టెండర్లను కూడా పిలుస్తున్నాయి. అయినా ఎవరూ పెద్దగా ముందుకు రావట్లేదు. దీంతో ఇప్పుడు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన లేఖలు రాశారు. ఇందులో వ్యాక్సిన్ల గురించే ప్రస్తావించారు.
రాష్ట్రాలకు విరివిగా టీకాలు ఇస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించినా.. అందుకు తగిన కార్యాచరణ మాత్రం జరగట్లేదు. దీంతో కేంద్రమే టీకాల బాధ్యత తీసుకోవాలని జగన్ పలు రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు జగన్.
ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇదే తరహా లేఖను బీజేపీయేతర ప్రభుత్వాలకు ఆయన రాసినట్టు తెలుస్తోంది. ఇందులో టీకా ఉత్పత్తిలో తమకు ఎదురైన సవాళ్లను ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. గ్లోబల్ టెండర్లను పిలిచినా.. జూన్ 3 నాటికి గడువు ముగిసినప్పటికీ ఒక్కరు కూడా టెండర్ కోసం రాలేదని జగన్ స్పష్టం చేశారు. దీంతో బిడ్ లను కేంద్రమే ఆమోదించాలన్న విషయాన్ని ఆయన తన లేఖలో తెలిపారు. వ్యాక్సిన్ బాధ్యతను కేంద్రానికే వదిలేయాలని ఆయన లేఖలో కోరినట్టు సమాచారం. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.