ఎమ్మెల్యేలకు జగన్ టెన్షన్..సీట్లపై తేల్చేస్తున్నారు?

-

నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు దక్కించుకునే విషయంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉందని చెప్పొచ్చు..ఇప్పటికే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ చెప్పేశారు…మరో ఆరు నెలల్లో పనితీరు మెరుగు పర్చుకోకపోతే సీటు ఇచ్చే ప్రసక్తి లేదని అన్నారు. అదే సమయంలో పీకే టీం సర్వే ప్రకారం…నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీటు దక్కడం డౌటే అని చెప్పొచ్చు.

అయితే ఎన్నికల వరకు ఎదురుచూడకుండా ఇప్పటినుంచే జగన్…సీట్లపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇటీవల ప్రతి నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో జగన్ సమావేశమవుతున్న విషయం తెలిసిందే. కార్యకర్తలతో సమావేశమై…నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్తితి, పార్టీ పరిస్తితి గురించి తెలుసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా గెలవాలనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు.

మొదట కుప్పం కార్యకర్తలతో సమావేశమయ్యి…అక్కడ భరత్ ని గెలిపించాలని జగన్ కోరారు. భరత్ ని గెలిపిస్తే నెక్స్ట్ మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ కుప్పంలో భరత్ పోటీ చేయనున్నారు. అలాగే రాజాం కార్యకర్తలతో భేటీ అయ్యి…మళ్ళీ కంబాల జోగులుని గెలిపించాలని జగన్ కోరారు. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన కంబాలని గెలిపించాలని అన్నారు…అంటే మూడోసారి రాజాంలో కంబాల పోటీ చేయడం ఖాయం. ఇలా వరుసపెట్టి కార్యకర్తలతో సమావేశమవుతూ..జగన్ అభ్యర్ధులని కూడా ప్రకటించేస్తున్నారు.

అయితే ఇలా అన్నీ స్థానాల్లో అభ్యర్ధులని ప్రకటిస్తారా అనేది డౌట్. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు..కాబట్టి వారి నియోజకవర్గాల గురించి మాట్లాడేప్పుడు బాగా పనిచేయండి అని జగన్ చెప్పే అవకాశం ఉంది తప్ప…సీటు ఫిక్స్ చేసే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇదే టెన్షన్ పట్టుకుంది…నెక్స్ట్ తమని గెలిపించమని కార్యకర్తలని కోరితే సీటు ఫిక్స్ అయినట్లే…లేదు బాగా పనిచేయండి అంటే సీటు డౌటే అని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేలకు ఇప్పుడే సీటు టెన్షన్ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news