నేడు జమ్మూ కాశ్మీర్ లో మోదీ పర్యటన… సైనికులతో కలిసి దీపావళి వేడుకలు

-

ఈ ఏడాది కూడా ప్రధాన మంత్రి మోదీ అక్కడే దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. గతంలో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు. నేడు ప్రధాన మంత్రి మోదీ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. అక్కడ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. నౌషేరా, రాజౌరీ సైనిక పోస్టులను పర్యటించనున్నారు. అక్కడి సైనికులకు స్వీట్లు పంచడంతో పాటు సైనికులతో మాట్లాడనున్నారు. 2014 నుంచి మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కాశ్మీర్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈసారి కూడా ఇలాగే దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. గత దసరా పండగ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. సైనికులతో కలిసి దసరా వేడుకలు చేసుకున్నారు.

గత కొంత కాలంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగానే భద్రతా బలగాలు వరస ఎన్కౌంటర్లలో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. కాగా తాజాగా ప్రధాని పర్యటనతో భద్రతా బలగాల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచనుంది.

Read more RELATED
Recommended to you

Latest news