కేంద్రంలో బీజేపీ.. మినీ ఇండియాలో ఈటల గెలుపు తధ్యం

-

దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ఓటర్లు మల్కాజిగిరి పార్లమెంటులో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన ఈ పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి చెందిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతోపాటు పారిశ్రామిక, విద్యా రంగాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక యూనిర్శిటీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతం మల్కాజిగిరి.

అలాంటి ప్రాంతానికి బీజేపీ రథసారధి, బడుగు బలహీన వర్గాల స్థితిగతులు తెలిసిన ప్రజా నాయకుడు ఈటలకు టికెట్ కేటాయించింది. ఈ ప్రాంతం టికెట్ కోసం ముగ్గురు, నలుగురు నాయకులు పోటీ పడినప్పటికీ.. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసేందుకు ఈటల రాజేందర్‌కు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. ఒకవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే.. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అకృత్యాలను ఎండగడుతున్నారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసిన మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ప్రజలు తనకి పట్టం కడతారని ఈటల ధీమా వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర, తెలంగాణ ఆత్మగౌరవం తెలిసిన వాడిగా నన్ను సంపూర్ణ విశ్వాసంతో ప్రజలు అక్కున చేర్చుకుంటారని ఈటల తెలుపుతున్నారు.

అయితే పలు సర్వేలు కూడా మల్కాజిగిరిలో ఈటల గెలుపు తధ్యమని చెబుతున్నాయి. జన్‌లోక్ పోల్ సర్వే- 2024 మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించి పలు విషయాలను వివరించింది. మల్కాజిగిరిలో పార్లమంట్ స్థానంలో ఈటల రాజెందర్‌ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. బీజేపీకి – 37.38%, కాంగ్రెస్- 35.38%, బీఆర్ఎస్- 24.93%, ఇతరులు – 2.50% ఓట్లు పొందే అవకాశం ఉందని సర్వేలో తేలినట్లు పేర్కొంది.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి.. మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున అభ్యర్థి ఈటల రాజెందర్ గెలవడం ఖాయమని చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సర్వేలకు బలాన్ని చేకూర్చాయి. చరిత్ర తెలంగాణ ఆత్మ గౌరవం తెలిసిన వాడిగా ప్రజల దగ్గర పేరు తెచ్చుకున్న ఈటల డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఈసారి మెజారిటీ ఎంపీలు గెలిస్తే.. రాష్ట్రంలో కీలకపాత్ర పోషించవచ్చని భావిస్తోంది బీజేపీ. మల్కాజ్ గిరి స్థానాన్ని కైవసం చేసుకుంటే.. తెలంగాణపై పట్టు సాధించవచ్చని చూస్తోంది. అందుకే పార్టీలో ప్రధాన నేతగా మారిన ఈటల రాజేందర్ ను మల్కాజిగిరి బరిలోకి దింపింది. ఇప్పటివరకు మల్కాజ్ గిరిపై కాషాయ జెండా ఎగరకపోవడంతో ఈసారి కచ్చితంగా గెలిచితీరాలనే కసితో పనిచేస్తున్నారు బీజేపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news