జనగాం నాదే..పల్లా ధీమా..ముత్తిరెడ్డి చెక్ పెడతారా?

-

115 అసెంబ్లీ సీట్ల అభ్యర్ధులని సులువుగానే తేల్చేశారు గాని..నాలుగు సీట్ల ఎంపిక మాత్రం కే‌సి‌ఆర్‌కు కాస్త పరీక్ష మారాయి. అందులో ముఖ్యంగా జనగాం, నర్సాపూర్ సీట్లు కఠిన పరీక్ష పెడుతున్నాయి. ఆ రెండు సీట్లలో సిట్టింగులని పక్కన పెట్టాలా? లేదా ఇద్దరు కీలక నేతలకు ఛాన్స్ ఇవ్వాలా? అని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. అయితే దాదాపు సిట్టింగులని పక్కన పెట్టినట్లే అని కథనాలు వస్తున్నాయి.

కానీ కే‌సి‌ఆర్ అభ్యర్ధులని తేల్చేవరకు ఏం జరుగుతుందో చెప్పలేం. అయితే జనగాం సీటులో రచ్చ ఎక్కువ కనిపిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య పోరు నడుస్తోంది. ఇద్దరిలో ఎవరికి సీటు దక్కుతుందో క్లారిటీ లేదు. ముత్తిరెడ్డిపై అనేక విమర్శలు వచ్చాయి. భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఇవి ఆయనకు మైనస్ గా మారాయి. సొంత కుమార్తె సైతం ఆరోపణలు చేసింది. అయితే ఇవన్నీ పల్లా చేయించారని, ఇదంతా కుట్ర అని ముత్తిరెడ్డి అంటున్నారు. కే‌సి‌ఆర్ తనకే సీటు ఇస్తారని చెబుతున్నారు.

RTC Chairman post for Muthireddy Yadagiri Reddy

అటు పల్లా ఏమో జనగాం సీటు తనదే అని గట్టిగా చెబుతున్నారు. కే‌సి‌ఆర్ సీటు తేల్చాక తాను ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తానని చెప్పుకొస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య పోరు ఉంది. ఈ పోరు వల్ల బి‌ఆర్‌ఎస్‌కే నష్టం జరిగేలా ఉంది. ఒకవేళ పల్లాకు సీటు ఖాయమైతే…ముత్తిరెడ్డి పార్టీ మారే ఛాన్స్ ఉంది. అలా చేస్తే బి‌ఆర్‌ఎస్‌కు నష్టం.

ఒకవేళ పార్టీ మారకపోయినా..ముత్తిరెడ్డి..పల్లా ఓటమికి పరోక్షంగా పనిచేసే అవకాశాలు బాగా ఉన్నాయి. కే‌సి‌ఆర్ సర్దిచెప్పిన..పైకి సరే అని..పరోక్షంగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ఎటు చూసుకున్న జనగాంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news