2024లో జనసేనదే విజయం: నాగబాబు – వీడియో

-

రాజకీయాల్లో గెలుపు, ఓటములు అనేవి చాలా సహజం. నాణేనికి ఉండే బొమ్మా బొరుసు లాంటివి. గెలిచినంత మాత్రాన వాళ్లు గొప్పవాళ్లేమీ కాదు.. ఓడిన వారు చేతగాని వాళ్లేమీ కాదు.. అని నాగబాబు అన్నారు.

ఏపీలో 2024లో జనసేనదే పక్కా విజయం అని ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 2024లో జనసేన శాసనసభ ఎన్నికల్లో గెలిచి తీరుతుందన్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో లేదో అన్న అనుమానంతో జనాలు జనసేనకు ఓటేయలేదని.. కానీ.. 2024లో జనసేనను గెలిపించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

రాజకీయాల్లో గెలుపు, ఓటములు అనేవి చాలా సహజం. నాణేనికి ఉండే బొమ్మా బొరుసు లాంటివి. గెలిచినంత మాత్రాన వాళ్లు గొప్పవాళ్లేమీ కాదు.. ఓడిన వారు చేతగాని వాళ్లేమీ కాదు. టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగానే ప్రజలంతా వైఎస్సార్సీపీకి ఓటేశారు. చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న కసితో ప్రజలంతా వైఎస్సార్సీపీకి ఓటేశారు. చంద్రబాబు కాకుండా వాళ్లకు కనిపించింది జగన్ మాత్రమే. అందుకే జగన్ గెలిచారు. అది కేవలం చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత, జగన్ పై ఉన్న సానుభూతి వల్లనే జరిగింది.. అని నాగబాబు తన యూట్యూబ్ చానెల్ వీడియో షేర్ చేశారు. తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులుగా పైవిధంగా ఆయన స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news