ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు, అక్కడి పోలీసులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు, అక్కడి పోలీసులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రాజోలులో పోలీసులు భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రాజోలుకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా ఓ వైపు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని చెబుతుండగా.. మరో వైపు పోలీసులు మాత్రం ఆయనపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేకు చెందిన అనుచరుడొకరు పేకాట ఆడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ అనుచరుడ్ని అరెస్టు చేశారు. అయితే అతన్ని విడిపించేందుకు ఎమ్మెల్యే రాపాక యత్నించారని, అదే సమయంలో ఆయన అనుచరులు మరికొందరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారని, ఇక ఎమ్మెల్యే రాపాక కూడా పోలీసులను దూషించారని పోలీసులు చెబుతున్నారు. అందుకే రాపాకపై కేసు నమోదు చేశామని, ఆయన్ను అరెస్టు కూడా చేస్తామని పోలీసులు తెలిపారు.
అయితే రాపాకను అరెస్టు చేస్తారన్న సమాచారం తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజోలుకు చేరుకుంటుండడంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.