బెజవాడ కనక దుర్గమ్మ ఆలయ సొమ్ముపై జనసేన పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. దసరా సందర్భంగా దుర్గగుడి కి సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకై ఇచ్చిన రూ 70 కోట్ల నిధుల విడుదల హామీ ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. దుర్గ గుడి ఈవో సురేష్ బాబు పనితీరు అవినీతి మయంగా మారింది అని ఆరోపించారు.
మూడు సింహాలు పోయినప్పుడు ఉన్న సెక్యూరిటీ సంస్థకు తిరిగి మళ్లీ వారికే కట్టబెట్టటం పలు అనుమానాలకి తావు ఇస్తున్నదన్నారు. మంత్రి అనుచరులులకే కాంట్రాక్టులను కట్ట బెట్టారని ఆయన విమర్శలు చేసారు. మంత్రి ప్రధాన అనుచరుడు లాక్ డౌన్ సమయంలో నాలుగు కోట్ల తో ఇల్లు కట్టుకోవటంపై వైసీపీ అధినాయకత్వమే అవాక్కు అయ్యేలా చేసిందన్నారు. అమ్మవారి ఆధాయాన్ని ఎక్కువ గా చూపి దేవాదాయ శాఖ కు అదనంగా కోట్లరూపాయలు కట్టడం దారుణం అన్నారు. అమ్మ వారి ఫిక్సిడ్ డిపాజిట్లు ఆలయ అభివృద్ధి పేరుతో కాజేయాలని కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శలు చేసారు. డిపాజిట్లు డ్రా చేస్తే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం అన్నారు.