జ‌న‌సేన పార్టీ గుర్తు ఏంటో తెలుసా..? ప‌వ‌న్ చెప్పేశారు..!

-

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు త‌న పార్టీ గుర్తును ప్ర‌క‌టించారు. పిడికిలి త‌మ పార్టీ గుర్త‌ని వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలులో నిన్న జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ త‌మ పార్టీ గుర్తుని అనౌన్స్ చేశారు. స‌మాజంలో అంద‌రి ఐక్య‌త‌కు చిహ్నంగా పిడికిలి ఉంటుంద‌ని, అందుక‌నే దాన్ని త‌మ పార్టీ గుర్తుగా ఎంపిక చేసిన‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. స‌మాజంలో ఉన్న అన్ని కులాలు, మ‌తాల‌కు చెందిన వారు క‌ల‌సి క‌ట్టుగా ఉండి త‌మ బ‌లాన్ని చాటేలా పిడికిలి చూపిస్తామ‌న్నారు ప‌వ‌న్‌.

పార్టీ గుర్తుగా పిడికిలిని ప్ర‌క‌టించిన అనంత‌రం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. టీడీపీ రౌడీల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌ని తేల్చి చెప్పారు. టీడీపీపై ప‌వ‌న్ తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. టీడీపీకి రెండు దారులు ఉన్నాయ‌ని, ఒక‌టి ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో పోరాటం చేయ‌డం, రెండోది వీధుల్లోకి రావ‌డం. రెండింటిలో తాను దేనికైనా సిద్ధ‌మేన‌ని ఉద్ఘాటించారు.

అవ‌స‌ర‌మైతే క‌ర్ర ప‌ట్టుకుని పోరాటం చేసేందుకు కూడా వెనుకాడ‌బోన‌ని ప‌వ‌న్ అన్నారు. ఇక ఎర్ర కాలువ స‌మ‌స్య‌పై తాను ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో అడుగుతున్నాన‌ని అన్నారు. కేజీ బేసిన్ ప్రజలందరిదని, దాంట్లో వాటా ఏపీ ప్రజలందరి హక్కు అని పవన్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు నుంచి టీడీపీకి చెందిన ఒక వ్యవస్థ ద్వారా టన్నులకొద్ది రేషన్‌ బియ్యం ఆఫ్రికాకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి అనుభవజ్ఞులైనవారు కావాలనే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని చెప్పారు. నిడదవోలులో ఆర్వోబీ బ్రిడ్జి నిర్మించలేకపోవడానికి ఇక్కడి పాలకులే కారణమని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news