మ‌ళ్లీ హీట్ పెంచుతున్న జ‌న‌సేన‌.. ఆ మంత్రి టార్గెట్‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

ఏపీ రాజ‌కీయాల్లో మొన్న‌టి దాకా కాస్త సైలెంట్‌గా ఉన్నట్టు క‌నిపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ట్రాక్ మీద‌కు ఎక్కిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఏ పార్టీని న‌మ్ముకున్నా లాభం లేద‌ని త‌మ పార్టీ నేత‌ల‌తోనే స్వ‌యంగా రంగంలోకి దిగాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వంలో కీలకంగా ఉంటున్న ఓ మంత్రిని టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది జ‌న‌సేన‌పార్టీ.ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వంలోని దేవాదాయ శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రిన్న‌టువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ రీసెంట్ గా ఓ జీవో ద్వారా భారీగా స్కామ్ చేసిన‌ట్టు జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. త‌న మిత్రుల కోసం కావాల‌నే ఓ జీవోను జారీ చేయించిన‌ట్టు తెలుపుతోంది జ‌న‌సేన‌.

 

మంత్రి తాను నివాసం ఉంటున్న తాడేపల్లిలోని క్యాపిటల్ బిజినెస్ పార్క్ కు ల‌బ్ధి చేకూర్చే విధంగా జీవో 61ను తీసుకొచ్చి త‌న బిజినెస్ పార్టనర్స్ కు భారీగా స‌బ్సిడీలు ఇచ్చారంటూ చెప్పారు. న‌లుగురు బిజినెస్ పార్ట‌న‌ర్లు క‌లిసి జీవో 61 ను ఆధారంగా చేసుకుని రూ.30 కోట్ల వ‌ర‌కు అక్ర‌మంగా స‌బ్సిడీ పొందిన‌ట్లు మ‌హేశ్ వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద దుమార‌మే రేపుతోంది. మొత్తానికి మొన్న‌టి వర‌కు కాస్త సైలెంట్‌గా క‌నిపించిన జ‌న‌సేన బీజేపీని దూరం పెట్టి స్వంతంగా పోరాడేండుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.