ఏపీ బిజెపిని దెబ్బ కొడుతున్న పవన్…?

Join Our Community
follow manalokam on social media

2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాజకీయం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది తెలియక పోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం కొంత మందిని దగ్గర చేసుకోవడానికి తీవ్రంగానే కష్ట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళుతున్న పవన్ కళ్యాణ్ కొంతమంది బీజేపీ నేతలకు వ్యక్తిగతంగా భరోసా ఇస్తున్నట్లు సమాచారం. జనసేన పార్టీలోకి రావాలని బీజేపీ నేతలను ఆయన కోరుతున్నట్లుగా తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో బిజెపిలో ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కారణంగా తాను కూడా నష్టపోతున్నా అని పవన్ కళ్యాణ్ బీజేపీ నేతల వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వంటివారిని బీజేపీలో నుంచి బయటకు రావాలి అని ఆయన కోరుతున్నట్లుగా సమాచారం.

త్వరలోనే వాళ్లతో పవన్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాదులో కామినేని శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ భేటీ కూడా అయ్యారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ కీలక పరిణామం కూడా ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకోవచ్చు. అయితే కామినేని శ్రీనివాస రావు బీజేపీలో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆయనతో సన్నిహితంగా ఉండే కొంతమంది బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. మరి కామినేని బయటకు వస్తారా లేదా అనేది చూడాలి.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...