అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే జేసీ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల విశాఖ జిల్లా పర్యటన కోసం అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ను వైసీపీ శ్రేణులు అడ్డుకొని ఆయన కాన్వాయ్ పై కోడిగుడ్లు,టమాటాలు విసిరినా సంగతి తెలిసిందే. అయితే ఒక సందర్భం లో జేసీ మాట్లాడుతూ విశాఖలో చంద్రబాబును కొట్టకపోవడం చాలా అదృష్టమంటూ జేసీ అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో చంద్రబాబును పోలీసులే కింద పడేసి చావగొట్టకపోవడం సంతోషకమరమంటూ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలానే జగన్ తొమ్మిది నెలల పాలన భేష్ అని కితాబిచ్చారు. జగన్ ఎప్పటికీ తమ వాడేనంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలకు కూడా జగన్ సర్కారు భద్రత తొలగించిన సంగతి తెలిసిందే.
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, యరపతినేని తదితరులకు భద్రత తొలగించడం తో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్ సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ టీడీపీ నేతలు ఆరోపించారు.