తాడిపత్రిలో జేసీకి బిగ్ షాక్..టీడీపీకి కీలక నేత రాజీనామా.!

-

తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. టి‌డి‌పికి చెందిన మైనార్టీ నేత రాజీనామా చేశారు. టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అయుబ్ బాషా…జేసీ ప్రభాకర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసి.పార్టీని వీడారు. అయితే జే‌సి ఫ్యామిలీ టి‌డి‌పిలోకి రాకముందు నుంచి అయూబ్..ఆ పార్టీలో పనిచేస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల నుంచి ఆయన టి‌డి‌పిలో పనిచేస్తున్నారు. అలాగే జే‌సి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అనేక కేసులని ఎడ్రుకున్నారు.

అయినా సరే 2014లో జే‌సికి సపోర్ట్ చేశామని, కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా తమని అణిచివేస్తున్నారని,  తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ అసలు లేదని, అక్కడ జేసీ పార్టీ మాత్రమే ఉందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వెంట ఇక మైనార్టీలు ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. అయితే తాడిపత్రిలో రెడ్డి వర్గంతో పాటు మైనారిటీల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ నిదానంగా మైనారిటీలు దూరమవ్వడం..జే‌సికి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. తాడిపత్రి అంటే జే‌సి ఫ్యామిలీ కంచుకోట. వరుసగా అక్కడ సత్తా చాటారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు.

దీంతో జే‌సి ఫ్యామిలీ హవాకు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ సారి ఎలాగైనా తాడిపత్రిలో మళ్ళీ సత్తా చాటాలని జే‌సి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాడిపత్రి మున్సిపాలిటీని గెలిపించుకున్నారు. ఇక అక్కడ జే‌సి, పెద్దారెడ్డిల మధ్య వార్ ఏ స్థాయిలో నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సమయంలో మైనార్టీ నేత టి‌డి‌పిని వీడటం జే‌సికి ఇబ్బందే.

Read more RELATED
Recommended to you

Latest news