ఆర్మూర్‌లో జీవన్ రెడ్డికి..వినయ్ ఎఫెక్ట్..ఈ సారి కష్టమేనా?

-

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం..బి‌ఆర్‌ఎస్ కంచుకోట. గత రెండు ఎన్నికల్లో వరుసగా బి‌ఆర్‌ఎస్ జెండా ఎగురుతుంది. బి‌ఆర్‌ఎస్ నుంచి జీవన్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్, టి‌డి‌పిల మధ్య ఆసక్తి పోరు ఉండేది. ఇక 2004లో ఒకసారి బి‌ఆర్‌ఎస్ గెలిచింది. అయితే 2009లో టి‌డి‌పి గెలవగా, 2014, 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. గతంలో టి‌డి‌పి నుంచి పోటీ చేసిన ఏలేటి అన్నపూర్ణ బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కే‌ఆర్ సురేశ్ రెడ్డి బి‌ఆర్ఎస్ లోకి వచ్చేశారు. దీంతో బి‌ఆర్‌ఎస్ బలం పెరిగింది.

ఇక వరుసగా రెండుసార్లు గెలిచిన జీవన్ రెడ్డి..మూడోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. దాదాపు ఈయనే మళ్ళీ పోటీ చేయడం ఖాయం..ఇందులో ఎలాంటి మార్పు లేదు. అయితే ఈ సారి జీవన్ రెడ్డికి చెక్ పెట్టడానికి బి‌జే‌పి చూస్తుంది. ఇక్కడ బి‌జే‌పి నేత వినయ్ కుమార్ రెడ్డి బాగా కష్టపడుతున్నారు. 2018లో ఈయనకు దాదాపు 20 వేల ఓట్లు వరకు పడ్డాయి. మూడో స్థానంలో నిలిచారు.

కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో  నిజామాబాద్ పార్లమెంట్ లో ధర్మపురి అరవింద్ గెలవడంలో వినయ్ కీలక పాత్ర పోషించారు. ఆర్మూర్ లో బి‌జే‌పికి ఆధిక్యం వచ్చింది. దీంతో సీన్ మారిపోయింది. అక్కడ జీవన్ వర్సెస్ వినయ్ అనే విధంగా పోరు మారింది. వినయ్ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. దీంతో ఆయనకు ప్రజా బలం పెరిగింది. జీవన్ రెడ్డికి ధీటుగా ఎదిగారు. లేటెస్ట్ సర్వేల్లో వినయ్‌కు బలం పెరిగిందని తెలిసింది.

అయితే అసెంబ్లీ అరవింద్ పోటీ చేస్తే ఆర్మూర్ నుంచే బరిలో ఉంటారని ప్రచారం ఉంది. ఒకవేళ అరవింద్ పోటీ చేసిన జీవన్ రెడ్డికి రిస్క్ తప్పదని తెలుస్తుంది. వినయ్ పోటీ చేసిన జీవన్ రెడ్డికి గట్టి పోటీ ఎదురవుతుందని అంటున్నారు. ఏదేమైనా ఈ సారి జీవన్ రెడ్డికి బి‌జే‌పితోనే రిస్క్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news