హుజూరాబాద్‌లో జంపింగ్‌లు.. ఇట‌నుంచి అటు.. అటునుంచి ఇటు!

ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారో అప్ప‌టి నుంచే హుజూరాబాద్ రాజ‌కీయాలు, ఇటు రాష్ట్ర రాజ‌కీయాలు వేడెక్కాయి. ఈట‌ల రాజేంద‌ర్ ఏ పార్టీలో చేర‌తారో అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు టీఆర్ ఎస్ హుజూరాబాద్‌లో రాజ‌కీయాలు చేస్తోంది. చాలామందిని త‌మ‌వైపు తిప్పుకోవ‌డానికి తెగ ప్ర‌య‌త్నిస్తోంది.

 

ఇప్పటికే గత కొన్నాళ్లుగా ఈటలకు జై కొట్టిన టీఆర్ ఎస్ ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువ మంది తిరిగి గులాబీ గూటికి చేరారు. ఇదే క్ర‌మంలో టీఆర్ ఎస్ వైపున నిల‌బ‌డ్డ చాలామంది మళ్లీ ఈటలకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

దీంతో ఇట‌నుంచి అటు, అట నుంచి ఇటు అన్న‌మాదిరిగా రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఈ పరిణామాలతో భవిష్యత్తులో ఈ జంపింగ్‌లు మరింతగా పెరిగే అవకాశం ఉందనే భావనను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక‌వేళ రాజేంద‌ర్ బీజేపీలో చేరితే.. టీఆర్ ఎస్ నుంచి మ‌రింత మంది ఆయ‌న వెంటే అవ‌కాశం ఉంది. అప్పుడు బీజేపీ నుంచి కూడా చాలామంది టీఆర్ ఎస్‌లో చేరే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ రాజ‌కీయాలు ఎటెవైపు దారి తీస్తాయో చూడాలి.