రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఎక్కడ ఉన్న ప్రత్యర్ధులు అన్నట్లే ఉంది కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలని చూస్తుంటే. ఒకప్పుడు వీరు వేరు వేరు పార్టీల్లో ఉంటే ప్రత్యర్ధులుగా ఉన్నారు..ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ ప్రత్యర్ధులుగా ఉన్నారు. గతంలో కడియం టిడిపి, రాజయ్య కాంగ్రెస్ లో ఉంటూ తలపడేవారు…విమర్శలు చేసుకునే వారు. సరే అప్పుడు వేరు వేరు పార్టీలు కాబట్టి అదంతా సహజమే.
కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు…అది కూడా కేసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ పార్టీలో..అయినా సరే వీరి రచ్చకు అదుపు లేదు. మొదట నుంచి రచ్చకు దిగుతూనే ఉన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ విమర్శలు అన్నీ స్టేషన్ ఘనపూర్ సీటు కోసమే..నువ్వు దొంగ అంటే..నువ్వు దొంగ అని, అవినీతిపరుడు అని విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ విమర్శలు కాస్త మరింత దారుణంగా తయారయ్యాయి. తాజాగా రాజయ్య..కడియం తల్లి నిజమని, తండ్రి ఊహ అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై కడియం ఆవేదన చెందుతూ..రాజకీయాన్ని రాజకీయంగానే చూద్దామని, కుటుంబాలని లాగొద్దని అన్నారు. అలాగే తన తల్లి పద్మశాలి అని, తన తండ్రి ఎస్సీ ఎని..పిల్లలకు తండ్రి కులమే వస్తుందని అన్నారు. ఇక కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తనతో పాటు తన కూతురు కావ్యకు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగారని… త్వరలోనే ఆధారాలు బయటపెడతానని రాజయ్య చెబుతున్నారు. దళితబంధులో రాజయ్య అక్రమాలకు పాల్పడ్డారని కడియం అంటున్నారు.
ఇలా ఇద్దరు నేతలు తిట్టుకుంటున్నారు. దీంతో ప్రగతిభవన్ నుంచి రాజయ్యకు పిలుపు వచ్చింది. కేటిఆర్..రాజయ్యతో మాట్లాడతారని తెలుస్తుంది. తర్వాత కడియంతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. త్వరగా ఈ రచ్చ సెట్ చేయకపోతే బిఆర్‌ఎస్ పార్టీకే నష్టం.