కల్వకుర్తి కుస్తీ..కారులో సీటు చిచ్చు..అభ్యర్ది ఎవరు?

-

కల్వకుర్తి నియోజకవర్గం..ఎన్టీఆర్‌ని ఓడించిన స్థానం. 1989లో ఇక్కడ ఎన్టీఆర్ టి‌డి‌పి నుంచి పోటీ చేసి..కాంగ్రెస్ అభ్యర్ధి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు. అలా ఎన్టీఆర్‌ని ఓడించిన ఈ స్థానంలో కాంగ్రెస్ హవా ఎక్కువ ఉండేది. ఇక 1999లో తొలిసారి ఇక్కడ టి‌డి‌పి గెలిచింది.టి‌డి‌పి నుంచి గుర్కా జైపాల్ యాదవ్ గెలిచారు. 2004లో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ 2009లో టి‌డి‌పి నుంచి జైపాల్ గెలిచారు.

తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు.  జైపాల్ బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు మూడో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి జైపాల్ గెలిచారు. అయితే ఎమ్మెల్యే జైపాల్ గొప్ప పనితీరు ఏమి కనబర్చలేదు. పైగా ఈయనపై సొంత పార్టీనే యాంటీగా ఉంది. ఈ సారి ఆయనకు సీటు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బి‌ఆర్‌ఎస్ లో అసంతృప్తి నేతలు సమావేశమై.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం మళ్లీ టికెటిస్తే, ఆయన మీద పోటీకి తామందరి తరఫున స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టాలని డిసైడ్ అయ్యారు.

brs party
brs party

జైపాల్‌కు కాకుండా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి లేదా మరో బీసీ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చిన పర్లేదు అని అంటున్నారు. ఇక టికెట్‌ రేసులో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు. అటు  బీసీలకైతే మాజీ మంత్రి జక్కుల చిత్తరంజన్‌దాస్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీసింగ్‌ ఉన్నారు. వీరిలో ఒకరికి సీటు ఇవ్వాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు. కానీ బి‌ఆర్‌ఎస్ అధిష్టానం ఈ సీటు ఇంకా తేల్చలేదు. అటు జైపాల్‌కే సీటు అని ఆయన వర్గం భావిస్తుంది.

అటు కాంగ్రెస్ లో కూడా గ్రూపులు ఉన్నాయి..కానీ దాదాపు వంశీకే సీటు ఫిక్స్. అలాగే బి‌జే‌పి నుంచి ఆచారికి సీటు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news