కమలం కోర్ కమిటీ..ముందస్తుతో ప్లాన్ ఛేంజ్..!

-

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్తితులు..బీజేపీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలు..ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై తాజాగా బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. గురువారం బండి సంజయ్ ఐదో విడత యాత్ర ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కోర్ కమిటీ భేటీ అయింది. కోర్ కమిటీ మీటింగ్‌కు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్‌తో పాటు కోర్ కమిటీ సభ్యులు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, లక్ష్మణ్, మురళీధర్ రావు తదితర నేతలు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే ఆరో విడత పాదయాత్ర గురించి చర్చ జరిగింది.  అసెంబ్లీ ఎన్నికలకు కార్యాచరణపై డిస్కస్ చేయనున్నారు. ఆరో విడత ప్రజా సంగ్రామ యాత్ర సంక్రాంతి తర్వాత కొనసాగే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా లేదా కొడంగల్‌-నిజామాబాద్‌ రూట్‌లో సంజయ్‌ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే పాదయాత్ర బదులు బస్సుయాత్ర ఉంటుందని తెలిసింది.

అంటే ఇంకా టోటల్ గా ప్లాన్ మార్చుకోవడానికి కమలం పార్టీ రెడీ అయింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో మాత్రం ఎన్నికలు ఎప్పుడు జరిగినా పాదయాత్ర ఉంటుందని తెలిసింది. ఇదిలా ఉంటే తాజాగా ఛలో కరినగర్ అని చెప్పి బీజేపీ కార్యక్రమం చేసింది. కరీంనగర్‌ని కరినగర్‌గా మార్చారు. దీనిపై అధికారంలోకి రాగానే నిజామాబాద్‌ను ఇందూరుగా, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా, మహబూబ్‌నగర్‌ను పాలమూరుగా, ఇబ్రహీంపట్నంను వీరపట్నంగా మారుస్తామని…అలాగే కరీంనగర్..కరినగర్ అంటున్నారు. అటు భైంసాని మహిషాగా మారుస్తామని బండి చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ముందస్తు ఎన్నికల బట్టి కమలం వ్యూహాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముందస్తు లేకపోతే యథావిధిగానే పాదయాత్ర కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అంటూ జాతీయ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్న కేసీఆర్ ముందస్తుకు వెళ్తారో లేదో చూడాలి. ఎప్పుడు ఎన్నికలోచ్చిన ఫేస్ చేయడానికి కమలం సిద్ధం అంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version