దేశాన్ని ముంచేస్తున్న కేసీఆర్ కుటుంబం: ఎంపీ అరవింద్

-

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం భాజపా అభ్యర్థి నరసింహ గౌడ్ తరఫున నిర్వహించిన రోడ్ షోలో ఎంపీ అర్వింద్​ పాల్గొన్నారు. ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి అవినీతి ఒక అలవాటని ఘటుగా విమర్శించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక ఎల్ఈడీ స్తంభానికి ఇరవై ఆరు వేలు ఇచ్చారని.. స్తంభానికి అంత ఖర్చు అవుతుందా అని ప్రశ్నించారు. స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు చుట్టి ఇదే అభివృద్ధి ఆంటే నమ్మే వారు లేరని అన్నారు. ఇదంతా వారి అవినీతిలో భాగమని ఉద్ఘాటించారు.

Arvind_BJP_MP
Arvind_BJP_MP

హైదరాబాద్ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అర్వింద్​ ఆరోపించారు. వరదల విపత్తు సమయంలో కేంద్రం 440 కోట్లు రాష్ట్ర సహాయ నిధికి ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ఇంటికి తిరిగి పరామర్శించారని ఎంత ఇబ్బందిలోనైనా మేం అండగా ఉంటామని వ్యాఖ్యనించారు. వరద బాధితులను కేసీఆర్ పరామర్శించారా అని అడిగారు.

ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త హామీలను ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మూసీ నదిని గోదావరితో అనుసంధానం చేస్తామంటున్న తెరాస ప్రభుత్వం… అందులోనూ అవినీతి చేస్తుందని ఆరోపించారు. భాజపా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని ఏ ఒక్క రాష్ట్రంలోను జరగని మత కలహాలు తెలంగాణ రాష్ట్రంలోని భైంసా, కరీంనగర్ లోనే ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. తెరాసను బలపరిస్తే ఎంఐఎం అభ్యర్థే మేయర్​ అవుతారని పేర్కొన్నారు. మత గొడవలకు తెర లేపేది తెరాసా పార్టీనే అని ఆరోపించారు. అభివృద్ధికి నిజాయితీగా పాటు పడే పార్టీకే ఓటు వేయాలని పేర్కొన్నారు. కమలం గుర్తుకు ఓటేసి భాజపా అభ్యర్థిని గెలిపించాలని ఎంపీ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news