కెసిఆర్ సంచలన నిర్ణయం, ఇక జాయింట్ కలెక్టర్లు ఉండరు…!

-

తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న జాయింట్ కలెక్టర్ పోస్ట్ ని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది. జాయింట్ కలెక్టర్‌ పోస్టును రద్దు చేసి, ఆ స్థానంలో అదనపు కలెక్టర్‌ పోస్టును కలెక్టర్ల సదస్సుకు రెండు రోజుల ముందు, ఆదివారం రాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ స్థానంలో అదనపు కలెక్టర్లు పని చేస్తారని ప్రభుత్వం తెలిపింది.

నాన్‌కేడర్‌ అధికారులను అదనపు కలెక్టర్‌ పోస్టుల్లో నియమిస్తూ కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలకు ఒకరు, రెవెన్యూ పాలనకు మరొకరు సేవలు అందిస్తారు. ఆదివారం రాత్రి భారీగా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసి, వారికి కెసిఆర్ సర్కార్ పోస్టింగులు ఇచ్చింది. నాన్‌ కేడర్‌ అధికారులైన స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను అదనపు కలెక్టర్లుగా నియమించింది ప్రభుత్వం.

అదే విధంగా ఐఏఎస్‌ అధికారులకు అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు)గా పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారి చేసింది. అదే విధంగా 49మంది అధికారులను బదిలీ చేస్తున్నారు. ఇటీవలే 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా దశాబ్దాలుగా జాయింట్ కలెక్టర్ వ్యవస్థ కొనసాగుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news