కేంద్రం ఆదేశాలు గుడ్డిగా అమలు చేయవద్దనే భావనలో కేసీఆర్…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు చూస్తుండగానే 800 మార్క్ దాటడం ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవరపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. తెలంగాణా సర్కార్ ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే అది మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు, హైదరాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదు కావడం ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది.

కోటి మంది జనాభా ఉన్న నగరం హైదరాబాద్. ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఇబ్బంది పడటం అనేది ఖాయంగా కనపడుతుంది. ఇక తెలంగాణాలో దాదాపు 8 జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు చాలా తీవ్రంగా ఉన్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. దీనితో నేడు కేబినేట్ సమావేశంలో తెలంగాణా ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

నేడు కేబినేట్ సమావేశంలో కేవలం రేపటి నుంచి కేంద్రం మార్గదర్శకాల ఆధారంగా తీసుకుని… లాక్ డౌన్ ని వ్యవసాయ పనులకు మాత్రమే సడలించాలి అని భావిస్తుంది సర్కార్. ఇక ఏ ఒక్క దానికి కూడా మినహాయింపు ఇవ్వొద్దు అని భావిస్తుంది. ఇక ఈ కామర్స్ సైట్స్ విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తేడా వస్తే వాళ్ళు కరోనా వాహకాలుగా మారే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు సర్కార్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలను గుడ్డిగా అమలు చేయవద్దు అని భావిస్తున్నట్టు తెలుస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news