పోటీ చేసేందుకు జంకుతున్న బీఆర్ఎస్ నేతలు.. కొత్త స్టేటజీ ఫాలో అవుతున్న కేసీఆర్..

-

టిఆర్ఎస్ టికెట్ కోసం గతంలో పైరవీలు చేసి మరీ పోటీపడిన నేతలందరూ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు.. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.. దీంతో మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.. ఇంట్రెస్ట్ గా లేని నాయకులకి ఆయనే ఫోన్ చేసి మరి పోటీ చేయాలంటూ సూచిస్తున్నారట.. టిక్కెట్ తీసుకుని ప్రచారం మాత్రమే చేయండి మిగతాదంతా మేము చూసుకుంటాం అనే భరోసాను ఆయన ఇస్తున్నారట.. ఖర్చంతా తామే పెట్టుకుంటాం.. చేసిన అభివృద్ధిని వివరిస్తే చాలు అని కేసిఆర్ అభ్యర్థులకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారట..దింతో వెనకడుగు వేసిన అభ్యర్థులు ఆలోచనలో పడ్డారని బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరు ముందుకు రావడం లేదు.. గతంలో బిఆర్ఎస్ చేజిక్కించుకున్న నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు వచ్చారు. మిగిలిన నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థులు ఆసక్తి చూపకపోవడంతో కేసీఆర్ రంగంలోకి దిగారట.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ఆ పార్టీకి అనుకూలంగా వస్తాయని.. పోటీ చేసి రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకోవడం ఎందుకనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారట..

మహబూబ్నగర్, చేవెళ్ల, మహబూబాబాద్, ఖమ్మం వంటి నియోజకవర్గాలలో అభ్యర్థులను టిఆర్ఎస్ అధినాయకత్వం ఫైనల్ చేసింది. ఆయా నియోజకవర్గాలలో ఉండే ముఖ్య నేతలను పిలిపించి వారికి సహకరించాలంటూ ఆదేశాలు జారీ చేసిందట.. అయితే ఖర్చు పెట్టేందుకు తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో.. ఆ బాధ్యత అంతా అధిష్టానం చూసుకుంటుందని, పార్టీ గెలుపు కోసం పని చేయాలంటూ ఓ కీలక నేత అభ్యర్థులకు చెప్పారని ప్రచారం నడుస్తోంది.. దాంతోపాటు జిల్లాలలో ఉండే అసమ్మతి నేతలను సైతం పిలిపించి మాట్లాడుతున్నారట.. అందరూ సమన్వయం చేసుకొని అత్యధిక ఎంపీ స్థానాల్లో కైవసం చేసేందుకు పనిచేయాలని.. సూచిస్తున్నారట. మొత్తంగా కెసిఆర్ రంగంలోకి దిగితే కానీ టిఆర్ఎస్ పార్టీ సెట్ రైట్ అవ్వలేదని టాక్ నడుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news