కేసీఆర్ వర్సెస్ అమిత్ షా…హోరాహోరీగా మునుగోడు పోరు!

-

ఇప్పటివరకు మునుగోడులో ఒక ఎత్తు…ఈ నెల 20 నుంచి మరొక ఎట్టు అన్నట్లు రాజకీయం నడవనుంది. ఇంతవరకు కింది స్థాయి నేతల మధ్యే వార్ నడవగా, ఈ నెల 20 నుంచి కేసీఆర్ వర్సెస్ అమిత్ షా అన్నట్లు రాజకీయ వార్ సాగనుంది. ఇప్పటికే మునుగోడుని కైవసం చేసుకోవడానికి అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలు హోరాహోరీగా కష్టపడుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీల కంటే కాంగ్రెస్ వెనుకబడి ఉంది.

అంటే మునుగోడులో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లే ఫైట్ జరుగుతుంది…ఇక దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల మాదిరిగా మునుగోడులో కూడా టీఆర్ఎస్ కు చెక్ పెట్టి సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది…ఇప్పటికే బీజేపీ నేతలంతా మునుగోడులో మకాం వేసి రాజకీయం చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అండగా నిలబడుతున్నారు. టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతని, కాంగ్రెస్ బలహీనతని క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తుంది. అలాగే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బలంగా ఉన్న నేతలని బీజేపీలోకి లాగాలని చూస్తున్నారు. ఎలాగైనా మునుగోడు కైవసం చేసుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే సత్తా తమకే ఉందని బీజేపీ నిరూపించుకోవడానికి చూస్తుంది.

ఇటు టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నికని చావో రేవో అన్నట్లు తీసుకుంది. ఈ ఎన్నికలో గాని ఓడిపోతే..అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం పడుతుంది. కాబట్టి అధికార బలాన్ని మొత్తం ఉపయోగించి మునుగోడులో గెలవాలని కారు పార్టీ చూస్తుంది. ఇప్పటికే మునుగోడు బాధ్యతలని మంత్రి జగదీశ్ రెడ్డి భుజాన వేసుకుని పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 20న మునుగోడులో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు…ఈ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ సభతో తమ సత్తా ఏంటో చూపించాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. లక్ష మందితో సభ నిర్వహించాలని చూస్తున్నారు.

అటు ఈ నెల 21న బీజేపీ సభకు ప్లాన్ చేసుకుంది..అమిత్ షా సభకు హాజరు కానున్నారు. టీఆర్ఎస్ ని మించి సభని సక్సెస్ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ సభలతోనే మునుగోడు పోరుని రసవత్తరంగా మార్చేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news