చరిత్ర సృష్టించనున్న కేసీఆర్…ఇక హస్తినలో..!

-

తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్ధం కాదు. ప్రత్యర్ధి ఒకటి అర్ధం చేసుకునేలోపు మరో వ్యూహంతో కే‌సి‌ఆర్ ప్రత్యర్ధులకు చెక్ పెట్టేస్తారు. అలా తన రాజకీయ చతురతతో ఇన్నేళ్లు తెలంగాణలో రాజకీయంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఇక ఇప్పటివరకు తెలంగాణలో తన వ్యూహాలని అమలు చేసిన కే‌సి‌ఆర్…ఇకపై ఢిల్లీపై ప్రయోగించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కే‌సి‌ఆర్ ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లోనే ఫెడరల్ ఫ్రంట్ అంటూ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి చూశారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

కానీ కేంద్రంలో మరొకసారి మోదీ ప్రభుత్వం మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో కే‌సి‌ఆర్ పప్పులు ఉడకలేదు. ఈ సారి మాత్రం కేంద్రంలో బి‌జే‌పికి అంత అనుకూల వాతావరణం కనిపించడం లేదు. అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు సత్తా చాటే బలం లేదు. దీంతో కే‌సి‌ఆర్ హస్తినపై ఫోకస్ పెట్టే ముందుకెళ్లెలా కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లోపు హస్తినలో గ్రౌండ్ రెడీ చేసుకోవాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే కే‌సి‌ఆర్ హస్తినలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అసలు దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో పార్టీ ఆఫీసు లేదు. ఎంతోకాలంగా రాజకీయాలు చేస్తున్న డి‌ఎం‌కే, అన్నాడి‌ఎం‌కే, టి‌డి‌పిలకు పార్టీ ఆఫీసులు లేవు. పార్టీలు అన్నీ పార్లమెంటులో తమకు కేటాయించిన గదుల్లోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ సర్దుకుపోతున్నాయి. కానీ  కేసీఆర్ మాత్రం పట్టుపట్టి ఢిల్లీలో పార్టీ ఆఫీసు కడుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణం కోసం ఢిల్లీలోని వ‌సంత్ విహార్ మెట్రో స్టేష‌న్ ప‌క్కన.. 1300 గ‌జాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సాధారణంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో.. కనీసం ఏడుగురు ఎంపీలు ఉన్న పార్టీలకు.. కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తారు…కాగా, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 16 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఢిల్లీలో పార్టీ కార్యలయం సెట్ చేసుకున్న కే‌సి‌ఆర్, నిదానంగా ఢిల్లీ రాజకీయాల్లో కూడా సెట్ అవుతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news