కే‌సీఆర్ మళ్ళీ కదం తొక్కుతున్నారు .. ప్రెస్ మీట్ లో సంచలన ప్రకటన !

-

 

తన పొలిటికల్ కెరీర్ తొలినాళ్లలో కేసీఆర్ ను అందరూ చాలా తక్కువగా అంచనా వేశారు. అయితే ఇప్పుడిప్పుడే తనలోని అసలు సిసలు రాజకీయ నేతను కేసీఆర్ బయటకి తీస్తున్నాడు. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్ అంటూ కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలతో కలిసేందుకు దేశాటన చేసిన కేసీఆర్ ఆ తర్వాత బిజెపికి సంపూర్ణ మెజారిటీ రావడంతో సైలెంట్ అయిపోయాడు. అదీ కాకుండా లోక్ సభ ఎన్నికల్లో తన టిఆర్ఎస్ పార్టీ చావు దెబ్బ తినడంతో ముందు తన ఇంట్లో దీపం చక్కదిద్దుకోవాలి అని ఆయన అనుకున్నాడు.

 

 

 

ఆ తరువాత విపరీతమైన రీతిలో హోం వర్క్ చేసిన కేసీఆర్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. చాలా వ్యూహాత్మకంగా తన మంత్రివర్గ మండలిని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ ఆ తర్వాత తన తర్వాతి ముఖ్యమంత్రిగా మరియు పార్టీ పెద్దదిక్కుగా అతని కొడుకు కేటీఆర్ ప్రవేశపెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఎందుకు అని అందరి మధ్యలో ఒక ప్రశ్న మెదులుతూ ఉండగానే నేడు అనూహ్యంగా అతను మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ ప్రసన్న తీసుకొని రావడం అందరిని ఔరా అనిపించింది.

ప్రస్తుతం తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలను కేటీఆర్ సమర్థతకు ఒక పరీక్షగా భావించిన కేసీఆర్ అతను అందులో తన సత్తా చాటుకున్న వెంటనే ఇక తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించాడు. దేశ ప్రజలంతా కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలతో విసిగిపోయారని మరియు ఈ దేశానికి మార్పు అవసరం అని భావిస్తున్న కేసీఆర్ మిగతా పార్టీల అన్నిటిని ఒక తాటి మీదకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంకా ముందుకు పోయి చాలా నమ్మకంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ విజయం సాధిస్తుందని అతను ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news