బ్రేకింగ్: సిబిఐకి సిఎం బిగ్ షాక్…!

-

కేరళ కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో సిబిఐని రాకుండా అడ్డుకుంది. తమ రాష్ట్రంలో కేసుల దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థకు ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ రోజు నుండి, సిబిఐ రాష్ట్రంలో కేసు నమోదు చేయడానికి కేరళ ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుంది అని ఆ రాష్ట్ర సిఎం పినరయి విజయన్ స్పష్టం చేసారు.

కొన్ని వారాల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. సిబిఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న కేసులను ఈ నిర్ణయం ప్రభావితం చేయదు అని పేర్కొంది. కేరళలో సిబిఐ చేపట్టే భవిష్యత్ కేసులపై ఇది ప్రభావం చూపుతుందని సిఎం పేర్కొన్నారు. మహారాష్ట్ర కంటే ముందు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే తరహా నిర్ణయాలు తీసుకున్నాయి. రాజకీయ ఉద్దేశాలతో తమ మీద సిబిఐ ద్వారా దాడులు చేస్తున్నారు అని ఆరోపించాయి.

Read more RELATED
Recommended to you

Latest news