జ‌గ‌న్‌.. నువ్వు పొరపాటున పీఎం అయ్యుంటే.. కేశినేని నాని సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ నేత కేశినేని నాని సెటైర్లు వేశారు. సీఎం జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే పరిపాలన సజావుగా సాగుతుందని కేంద్రం చెబుతున్న వేళ, మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నించారు.

” నీకున్న తెలివితేటలు మోదీగారికి లేవు జగన్. ఢిల్లీలో వున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ వేరు వేరు చోట్ల వుండటం వల్ల సమర్థవంతంగా పని జరగటం లేదని ఒకే చోటుకు తీసుకువస్తున్నారు. పొరపాటున నువ్వు ప్రధానమంత్రి అయి ఉంటే 28 రాష్ట్రాలలో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 36 రాజధానులు పెట్టేవాడివి” అని ఎద్దేవా చేశారు.