టీడీపీకి కేశినేని నానీ గుడ్ బై…? త్వరలో రాజీనామా లేఖ…?

-

బెజవాడ టిడిపిలో వర్గ విభేదాలు ఇప్పుడు ఆ పార్టీలో తారస్థాయికి చేరుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక కార్యకర్తలలో కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయని సమాచారం.

పార్టీలో తనకు సహకరించడం లేదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద వైసిపి బలంగా దృష్టి పెట్టినా సరే తనకు నేతల నుంచి సహకారం రావడం లేదు అనే ఆవేదనలో కేసినేని నాని ఉన్నారు. తన కుమార్తె పోటీ చేయడం ఇష్టం లేని కొంతమంది నేతలు పార్టీని ఇబ్బంది పెడుతున్నారు అనే ఆవేదన కూడా కేసినేని నాని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఆయన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఒక లేఖ రాయనున్నారు.

త్వరలోనే తన వర్గంతో ఒక సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఆయనపై బహిరంగంగా విమర్శలు చేయడం ఆయనను బహిరంగంగా ఇబ్బంది పెట్టడం వంటివి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గం ఎక్కువగా చేస్తోంది. దీంతో మనస్తాపం చెందిన కేసినేని పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని ఏంటి అనేది త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబునాయుడు ఈ వివాదాల మీద ఎక్కువగా దృష్టి సారించారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news