పీవీ కుటుంబాన్ని అవమానించేందుకే ఎమ్మెల్సీ సీటు.. రేవంత్‌ రెడ్డి

-

మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి, హైదరాబద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధానీ పీవీ నరసింహారావు సురభి వాణిదేవీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు పీవీ కుటుంబంపై అభిమానం ఉంటే గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చినా.. లేకపోతే రాజ్యసభలో ఇచ్చిన ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నించే వారం కామని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అత్యంతంగా గౌరవమిచ్చిన కాంగ్రెస్‌ నాడు పీవీ నరసింహారావ్‌ను ప్రధాని చేస్తే.. నేడు అక్కడ ఓడితామని స్పçష్టంగా తెలిసి కూడా టీఆర్‌ఎస్‌ ఆ కుటుంబాన్ని ఆవమానించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పీవీ కుమార్తెను ఓడించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీవీ ప్రతిష్టను మసకబారేందుకు కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించారన్నారు.

ఓడిపోతామని తెలిసే..

పీవీ కుటుంబంపై అభిమానం ఉంటే మరో ఆరు నెలల్లో రాజ్యసభ వస్తుందని లేదంటే నేరుగా గవర్నర్‌ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలన్నారు. అలా కాకుండా ఓడిపోయే సీట్లో పీవీ కుటుంబాన్ని దింపి తెలంగాణ వాసులకు ఓ పరీక్షగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు.కేసీఆర్‌ పీవీ కుటుంబాన్ని అభిమానంతో కౌగిలించుకోవడం లేదని అది ద్రుతరాష్ట్ర కౌగిలి అని ఇప్పటికైన సమయం మించిపోలేదని సురభివాణి దేవీ భీపాంను రిజక్ట్‌ చేయాలని కోరారు. గెలిచే స్థానమైతే కేసీఆర్‌ కుటుంబ సభ్యులను బరిలోకి దించాలని అక్కడ ఓటమి చవి చూడాల్సి వస్తుంని తెలిసే పీవీ కుటుంబాన్ని దింపి వారి గౌరవాన్ని కించపరుస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news