కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్…!

కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు ఆక్సీజన్ గురించి కరోనా మందుల గురించి ఫోన్ లు ఎక్కువగా వస్తున్నాయి. దీనితో ఎమ్మెల్యేలు ఇందుకోసం ప్రత్యేక కార్యాలయాలను కూడా ఓపెన్ చేస్తున్నారు.

ప్రత్యేకంగా ఉద్యోగులను పెట్టుకుని రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఉద్యోగుల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు రోగులకు చేయిస్తున్నారు. ఆస్పత్రుల కొరత ఉన్న నేపధ్యంలో రోగులు ఇబ్బంది పడకుండా జిల్లాలో ఉన్న వివిధ ప్రభుత్వ ఆస్పత్రులతో మాట్లాడుతూ చర్యలు చేపడుతున్నారు. మంత్రులకు సమస్యలు చెప్పినా పరిష్కారం కాకపోవడంతో ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడం గమనార్హం.