బ్రేకింగ్‌ : బిజెపిలోకి రేవంత్ రెడ్డి.. కీలక పదవి ఇస్తామన్న కేంద్ర మంత్రి..?

-

తెలంగాణాలో ఇవాళ బలపడతాం, రేపు బలపడతాం, ఎల్లుండు కెసిఆర్ అంతు చూస్తాం, ఆ జీవోలు ఈ జీవోలు అంటూ తెలంగాణా బిజెపి ఆడుతున్న రాజకీయం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. దాదాపు ఆరు నెలల నుంచి ఏడేళ్ళ నుంచి ఈ రాజకీయం మరింతగా పెరిగిపోయింది. సంఘ్ పరివార్ రాష్ట్రంలో ఒక సభ నిర్వహించింది. ఇక తెలంగాణాలో నాలుగు ఎంపీ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలిచింది.

ఇప్పుడు బిజెపి కీలక నేతలను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో బలంగా క్యాడర్ ఉండే నేతల కోసం గాలం వేస్తుంది బిజెపి. ఇందులో భాగంగానే కిషన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు నేతలకు ఆహ్వానాలు అందించింది రాష్ట్ర పార్టీ. ఇక కేంద్ర నేతలు కూడా బిజెపిలోకి కీలక నేతలకు ఆహ్వానాలు అందించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు.

రేవంత్ రెడ్డి కోసం బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపధ్యంలోనే ఆయన కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ఒక ఆఫర్ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తామని, అదే విధంగా రాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగిస్తామని, తెలంగాణాలో తమ జోక్యం ఉండదని, మీరే అన్ని బాధ్యతలు చూసుకోవడంతో పాటుగా సీట్ల ఎంపిక విషయంలో కూడా తాము ఎక్కడ జోక్యం చేసుకోమని స్పష్టం చేసారట.

ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా సరే రాజ్యసభకు పంపిస్తామని ఆఫర్ ఇచ్చారట. ఇటీవల వీరి మధ్య ఒక భేటీ కూడా జరిగినట్టు సమాచారం. త్వరలోనే తాను సమాధానం చెప్తా అని కూడా రేవంత్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుత౦ రేవంత్ రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ లో సరైన గుర్తింపు లేదు అనేది వాస్తవం. రాజకీయంగా బలహీనంగా ఉన్న ఆ పార్టీ రేవంత్ ని వాడుకోవడం లో ఘోరంగా విఫలమైంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Read more RELATED
Recommended to you

Latest news