కొడాలి నాని…ఈ పేరు చెప్పగానే చంద్రబాబు అందరికీ గుర్తొచ్చేస్తారు. ఎందుకంటే కొడాలి…బాబుల మధ్య అంతటి గొప్ప సంబంధం ఉంది. అసలు చంద్రబాబు కోసమే కొడాలి నాని ఉన్నారనే విధంగా రాజకీయాలు నడుస్తాయి. అసలు బాబు పేరు తీయకుండా కొడాలి నాని ప్రెస్ మీట్ ఉండదు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు చంద్రబాబు, జగన్ ప్రభుత్వంపై ప్రతిరోజూ మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ విమర్శలు చేస్తుంటారు.
ఈ విమర్శలకు వైసీపీ నేతల నుంచి కౌంటర్లు ఎప్పటికప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ ఎందరు కౌంటర్లు ఇచ్చినా సరే కొడాలి కౌంటర్ ఇవ్వనిదే రాజకీయాల్లో పెద్ద కిక్ ఉన్నట్లు అనిపించదు. అందుకే నాని సమయం బట్టి మీడియా సమావేశం పెట్టి మరీ బాబుకు చుక్కలు చూపిస్తుంటారు. ఇక నాని విమర్శలు ఎలా ఉంటాయో… ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ రేంజ్‌లో నాని విమర్శలు ఉంటాయి. ఇటీవల స్థానిక ఫలితాలు వచ్చాక కూడా నాని మీడియా మీట్ పెట్టి మరీ బాబుని ఏకీపారేశారు.
అయితే నానికి టిడిపి నుంచి కౌంటర్లు వచ్చాయి…ఎంఎస్ రాజు, పిల్లి మాణిక్యాలరావులు కూడా తమ నోటికి పని చెప్పారు. ఇక ఇంతవరకు బాగానే ఉంది గానీ… నాని, బాబులు ఒకే కమ్మ వర్గానికి చెందిన నాయకులు అనే సంగతి తెలిసిందే.
అయితే బాబుని నాని తిడితే… టిడిపిలో ఉండే కమ్మ నాయకులు ఒక్కరు కూడా స్పందించారు. అదే విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా కృష్ణాలో ఉండే కేశినేని నాని, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు మాట్లాడరు. ఇక దేవినేని ఉమా సంగతి తెలిసిందే. వీరు అనే కాదు…మిగిలిన కమ్మ నేతలు అసలు స్పందించరు. ధూళిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, జివి ఆంజనేయులు, శ్రీధర్, కోడెల శివరాం, పరిటాల ఫ్యామిలీ, రాయపాటి ఫ్యామిలీ, పయ్యావుల కేశవ్ ఇలా చెప్పుకుంటూ పోతే కమ్మ నేతలు ఎవరు నానికి కౌంటర్లు ఇవ్వరు. మరి ఇందులో ఏ మర్మం ఉందో వారికే తెలియాలి.