కేసీఆర్ అంటే సమయ స్ఫూర్తికి మరోపేరు. ఆయన ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. తిట్టిన నోటితోనే పొగిడించుకోవడంలో ఆయన దిట్ట. కానీ కేటీఆర్ మాత్రం ఇందులో పూర్తి స్థాయిలో సక్సెస్ కావట్లేదు. కొన్ని సార్లు దూకుడుగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నాడు.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత సీఎం కేసీఆర్ గడిచిన పది రోజుల్లోనే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. వరుసపెట్టి సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నారు. తనపై వచ్చిన విమర్శలను చేతలతోనే తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
ఇదే క్రమంలో జూడాలు సమ్మెకు దిగితే ఆయన చాకచక్యంగా మాట్లాడారు. కరోనా వేళ పరిస్థితిని అర్థం చేసుకోవాలని అనునయ మాటలు కేసీఆర్ నోటి నుంచి వచ్చాయి. అంతేగానీ ఎక్కడా ఘాటైన ఆదేశాలు లేవు. కానీ కేటీఆర్ మాత్రం దూకుడుగా మాట్లాడి విమర్శల పాలయ్యాడు. సమ్మె విరమించకుంటే చర్యలు తప్పవన్న వార్నింగ్ కేటీఆర్ నోటి నుంచి రావడంతో.. అటు జూడాలు, ఇటు ప్రజలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. తండ్రిలాగా సమయస్ఫూర్థిగా మాట్లాడాలంటూ కితాబిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. ఈ మధ్య చాలా పనుల్లో కేటీఆర్ పనులు పక్కన పెట్టి మాటలకే పరిమితం అవుతున్నారు. ఈ పద్ధతి మార్చుకోకుంటే కష్టమే.