ఏప్రిల్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

ఏప్రిల్ మెుదటి వారం లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విజయ సంకల్ప యాత్ర రోడ్ షో సందర్బంగా వారసి గూడా లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో అవీనితిరహిత ,శాంతి భద్రతలు బడుగు బలహీనులకు సంక్షేమ పాలనకు అందించే విధంగా తొమ్మిదిన్నర ఏళ్ళుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుంది.ఈ దేశం కోసం, పిల్లల భవిష్యత్, పేదల ప్రజల సంక్షేమం కోసం ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యం చేయడానికే విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది అని తెలిపారు.

ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈ యాత్రలు కొనసాగుతున్నాయి. అంబర్ పేటలో చౌరస్తాలో జరిగే సభతో మన యాత్ర పూర్తి అవుతుంది కరోనా వంటి కిష్ట సమయంలో దేశాన్ని మోదీ ఎలా కాపాడారో అందరికి తెలిసిందే
నాడు హైదరాబాద్ తో పాటు దేశంలోని ముంబై వంటి నగరాలలో పాకిస్థాన్ ISS ఉగ్రవాదుల దాడులను చూశాం.  మోడీ వచ్చిన తర్వాత దేశం ప్రశాంతంగా మారింది. భారత్‌ను ప్రపంచదేశాలు పొగిడే విధంగా చేశారు. దేశంలో బెస్ట్ లీడర్‌గా వెలుగొందుతున్నారు. అన్ని సర్వేలలో మోడీ టాప్ లో నిలుస్తున్నారు.
5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు.అందరికి కడుపు నింపడానికి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు
మరో 5 ఏళ్ళ పాటు ఉచిత బియ్యాన్ని పంపణి చేయనున్నారు. అయిష్మాన్ భారత్ ఆరొగ్య భీమా అందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మోడీని  మరోసారి ఆశీర్వదిద్దాం అని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news