ఎన్డీయే కూటమిపై ఎంపీ లావు కీలక వ్యాఖ్యలు… టీడీపీ నేతల్లో పెరుగుతున్న నిరాశ

-

ఎన్డీయేతో అలయన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.NDA కూటమిలో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన ఏమీ ఒరగలేదని టీడీపీ గ్రాఫ్ ఏమాత్రం పెరగలేదని ఆయన పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో గెలవాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పగా ఈ మాటలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వైసీపీ ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు గత నెలలో టీడీపీకి వలసవెళ్లారు. అయితే టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తూ సొంత కూటమిపై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. రోజు రోజుకి టీడీపీ నేతల్లో నిరాశ పెరిగిపోతున్నట్టు ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ఎంత బలంగా ఉందో తాజాగా ఎంపీ కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలను బట్టి చెప్పవచ్చు. ఆయనే కాదు ఇటీవల టీడీపీకి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంత కష్టపడినా ఇంకా 2శాతం ఓట్లతో వైసీపీకంటే వెనుకంజలో ఉన్నామని టీడీపీ కీలక నేత చెప్పిన విషయం తెలిసిందే. ఇంకా చాలామంది టీడీపీ నాయకులు ఇదే నమ్ముతున్నారు. ఈసారి కూడా ప్రజల మనసులు గెలవలేమని మనసులో సర్దిచెప్పుకుంటున్నారు.అటు సర్వేలు కూడా వైసీపీకే పట్టం కట్టేశాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ కూటమి ఆశించిన ఫలితాలు సాధించడంపై అనుమానాలు నెలకొన్నాయి.

ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.నామినేషన్ల పర్వం నేటితో ముగియగా వైసీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాలు కొనసాగిస్తున్నారు.ఓటర్లను మెప్పించడానికి చంద్రబాబు, పవన్ ఇంకా లోకేష్, బీజేపీ నాయకులు ఆపసోపాలు పడుతున్నారు.ఈ ఎన్నికలలో గెలవకపోతే ఇక రాజకీయ భవితవ్యం ఉండదని టీడీపీ నాయకులు ఈ నిర్ణయానికి వచ్చి పెద్దమొత్తంలో ఖర్చుపెడుతున్నారు. అయినప్పటికి అనుకూల పవనాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.ఈ ఎన్నికల తరువాత టీడీపీ అడ్రస్ కనపడదు అని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు నిజమయ్యేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news