తెలుగు మీడియా సిగ్గు తెచ్చుకోవాల్సిన పాయింట్ ఇది !

-

దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నంత దరిద్రపు మీడియా మరొక రాష్ట్రంలో ఉండదని చాలా మంది జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు ప్రముఖులు చాలా సందర్భాలలో కామెంట్లు చేయడం జరిగింది. ఒక ఉద్దేశపూర్వకంగా ఒక కులానికి లేకపోతే రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా పనిచేస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు ప్రసారం చేస్తాయి అని చాలామంది ఏపీ లో ఉన్న మీడియా పై సీరియస్ అవుతుంటారు.

Related image

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే ఉండే ఎల్లో మీడియా ఛానల్స్ తమ ప్రత్యర్థులు ఎవరైనా వాళ్ల కుటుంబ జీవితాలను వ్యక్తిగత జీవితాలపై బురదజల్లడానికి ఎటువంటి దారుణమైన అబద్ధాలు అయినా నిజం చేయడానికి నిజమే అన్నట్టు గా చూపించడానికి తెగ తాపత్రయ పడుతుంటారు అంటూ చాలామంది మంచి పడుతుంటారు. అయితే తెలుగు మీడియా చానల్స్ ధోరణి ఈ విధంగా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన బీబీసీ వార్తా సంస్థ అమెరికా లెజండ‌రీ బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్ కోబ్ బ్రియాంట్ దుర్మ‌ర‌ణ వార్త‌కు సంబంధించి ప్ర‌సారంలో దొర్లిన త‌ప్పిదానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పి త‌న ఔన్న‌త్యాన్ని, జ‌ర్న‌లిజం విలువ‌ల‌ను కాపాడింది.

 

మేటర్ లోకి వెళ్తే బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్ మ‌ర‌ణ వార్త‌కు సంబంధించి ఉద‌యం ప‌ది గంట‌ల బులిటెన్‌లో ప్రసారం చేసింది. ఈ వార్త‌లో మృతుడికి బ‌దులు లిబ్రోన్ జేమ్స్ చిత్రాల‌ను చూపారు. జేమ్స్‌, కోబ్ కెరీర్ పాయింట్ల‌ను అధిగ‌మిస్తున్న వార్త‌ను ప్ర‌సారం చేశారు. నిజానికి ఇది పొర‌పాటున జ‌రిగిందే త‌ప్ప ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసింది కాదు. దీంతో ఈ ఎపిసోడ్ ని బీబీసీ లో చూసిన వీక్షకులు ప్రముఖ వ్యక్తి ప్లేయర్ మృతి పట్ల ఈ విధంగా వ్యవహరించడంతో బీబీసీ కి వ్యతిరేకంగా కామెంట్లు చేయటంతో వెంటనే తప్పును తెలుసుకున్న బీబీసీ త‌న విజ్ఞ‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. అదే బులిటెన్ చివ‌ర్లో న్యూస్ రీడ‌ర్ రీతా చ‌క్ర‌వ‌ర్తి జ‌రిగిన పొర‌పాటుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అలాగే బీబీసీ ఎడిట‌ర్ (సిక్స్ అండ్ టెన్‌) పాల్ రాయ‌ల్ ట్విట‌ర్ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పి హూందాత‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. దీంతో తెలుగు మీడియా బి.బి.సి ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని మరి కొంతమంది తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్లు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news