మీ బాబు వల్లే కాలేదు.. మీ వల్ల ఏం అవుతుంది.. ప్రశ్నించిన లోకేశ్

-

అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండటం ఏం బాగోలేదు సార్.. అంటూ మరో ట్వీట్ విసిరారు లోకేశ్.

మీ బాబు(వైఎస్సార్).. మా బాబు(చంద్రబాబు)పై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్ర వేయాలని అడ్డదారులు తొక్కారు. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరమూ కాదు. వంశధారపై మీరు వేసిన కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చింది.. అంటూ నారా లోకేశ్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.

నారా లోకేశ్ బహిరంగంగా మాట్లాడటం చాలా అరుదు. ఆయన ఎప్పుడూ ట్విట్టర్‌లోనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ట్విట్టరే ఆయనకు మైకు. చాలాసార్లు ఇదివరకు కూడా ఆయన ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్‌ను విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. వైఎస్సార్, చంద్రబాబులను కూడా తన ట్వీట్‌లోకి లాగారు. మీ బాబు వల్లే ఏం కాలేదు.. మీ వల్ల ఏం అవుతుంది… అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు.

అంతే కాదు.. పోలవరంపై టీడీపీ హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల.. కల గానే మిగిలిపోతుంది… అంటూ మరో బాణం విసిరారు.

అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండటం ఏం బాగోలేదు సార్.. అంటూ మరో ట్వీట్ విసిరారు లోకేశ్. చంద్రబాబుపై శాసనసభలో వేసిన 26 విచారణ కమిటీలకు సంబంధించిన లిస్టును కూడా లోకేశ్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news