గతేడాది మహేష్-బన్నీ మధ్య బిగ్ వార్ జస్ట్ మిస్. భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాలు సమ్మర్ కానుకగా ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వార్ మిస్ అయింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి మ్యూచివల్ అండర్ స్టాండింగ్ కు వచ్చారు. భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత నా పేరు సూర్య విడుదలైంది. దీంతో రెండు సినిమాలకు రిలీజ్ పరంగా గానీ, వసూళ్ల పరంగా గానీ ఇబ్బందులు తలెత్తలేదు. కానీ అప్పుడు మిస్ అయిన వార్ వచ్చే సంక్రాంతికి షురూ అయ్యేలా ఉంది. ఇప్పటికే మహేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `సరిలేరు నీకెవ్వరు` సంక్రాంతి బెర్త్ కన్ఫమ్ చేసుకుంది.
సరిగ్గా భోగికి ముందు రోజు గానీ, భోగి రోజున కానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారుట. తొలికాపీ సిద్దమయ్యే సరికి నవంబర్ వచ్చేస్తుందని యూనిట్ అంటోంది. దీంతో డిసెంబర్ గ్యాప్ ఇచ్చి సంక్రాంతికి రిలీజ్ చేస్తే అన్ని రకాలు గా కలిసొస్తుందని భావిస్తున్నారుట. డిసెంబర్ రిలీజ్ చేయోచ్చు కదా? అనే సందేహం రావడం సహజం. కానీ ఆనెలలో సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ లు పెట్టుకోరు. రెవెన్యూ పరంగా ఆ నెల కలిసిరాదు అన్న సెంటిమెంట్ ప్రకారం ఇంకొంత మంది హీరోలు వెనకడుగు వేస్తారు.
ఇక సంక్రాంతికి సమీపంగా ఉన్న నెల జనవరి కాబట్టి ఎంత కాపిటీషన్ ఉన్నా మ్యాగ్జిమమ్ ఆనెలలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో బన్నీ-మహేష్ మధ్య ఈసారి పోటీ తప్పదని తెలుస్తోంది. ఆనెలలో ఏ హీరో రాజీ పడటానికి ఒప్పుకోడు. థియేటర్లు ఎన్ని దొరికినా…రిలీజ్ కు రెడీ అంటూ కాలు దువ్వుతారు. 2020 సంక్రాంతికి ఆ సన్నివేశం తప్పదని తెలుస్తోంది. ఇంకా చోటామోటా హీరోల సినిమాలు ఎలాగూ రిలీజ్ కు ఉంటాయి. ఆవేమి ఆ చిత్రాలకు కాంపిటీషన్ కాదనుకోండి.