లోకేష్ ఫైర్… రాజకీయ పునరావాస కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు

-

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ lokesh సోషల్ మీడియా వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయని ఫైర్ అయ్యారు. లోకేష్ ఆగ్రహానికి అసలు కారణం వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పుట్టిన రోజు వేడుకలను విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించడమే.

లోకేష్/ lokesh
లోకేష్/ lokesh

గురువారం విజయసాయిరెడ్డి జన్మదినం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఐక్య కార్యాచ‌ర‌ణ సమితి ఆధ్వర్యంలో… ఆయన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తన ఛాంబర్ లో కేక్ కోసి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. అయితే దీనికి సంబంధించిన ఓ వార్త‌ను నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… ఏయూలో ఓ రాజకీయనేత పుట్టిన రోజు వేడుకలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు జగన్ పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని లోకేష్ ఫైర్ అయ్యారు.ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 11 సీబీఐ కేసుల్లో నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణమని పేర్కొన్నారు. స్వయంగా వీసీనే కుల పిచ్చితో దొంగల జీవితాలను ఆదర్శంగా తీసుకోమని బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులకు చెప్పడం తీరని అన్యాయం చెయ్యడమేన్ని వ్యాఖ్యానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news