మొత్తానికి ఏపీలో ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా రాజకీయం చేస్తున్నాయి. మొన్నటివరకు అధికార పార్టీ కేసులు పెడుతుందేమో, జైలుకు పంపిస్తుందేమో అని ప్రతిపక్ష నేతలు భయపడ్డారు. అయితే కేసులు, జైలుకు వెళ్ళడం వారికి అలవాటు అయిపోయింది..దీంతో నేతలు తెగించేశారు…ఇంకా ఏదేమైనా వైసీపీపై పోరాటమే అన్నట్లు ముందుకెళుతున్నారు. ఇప్పటికే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్..ఓ రేంజ్లో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఫైర్ అవుతున్నారు. ప్రజల్లోకి వస్తున్నారు..ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు.
ఇక టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. కుప్పం టూ ఇచ్చాపురం పాదయాత్ర ఉండనుంది..దాదాపు అన్నీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర జరగనుంది. ఈ పాదయాత్ర ద్వారా టీడీపీకి ఎంతోకొంత మేలు చేసే అవకాశం ఉంది.
ఇక లోకేష్ పాదయాత్ర చేస్తుంటే…పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు అన్నీ స్థానాల్లో పవన్ బస్సు యాత్ర ఉండనుంది. జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడంతో పాటు..జనసేనన బలోపేతం చేసే దిశగా పవన్ ముందుకెళ్లనున్నారు. వాస్తవానికి పవన్ బస్సు యాత్ర గత దసరాలోనే మొదలుకావాలి. కానీ సినిమా షూటింగ్లు పూర్తి కాకపోవడంతో, వచ్చే జనవరి నుంచి బస్సు యాత్ర చెప్పాలని భావిస్తున్నారు.
అయితే జనవరిలో ఉంటుందో లేక ఉగాదికు ఉంటుందో తెలియదు గాని..మొత్తానికి పవన్ బస్సు యాత్ర మాత్రం ఖాయం. ఓ వైపు లోకేష్ పాదయాత్ర, మరోవైపు పవన్ బస్సు యాత్ర చేయనున్నారు. మరి ఈ యాత్రల వల్ల వైసీపీకి ఇబ్బందయ్యే ఛాన్స్ ఉంది. మరి అలాంటప్పుడు వారికి చెక్ పెట్టేలా జగన్ ఎలాంటి ప్లాన్స్ వస్తారు..లేక వారు పాదయాత్రలు చేస్తుంటే వైసీపీ శ్రేణుల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం…లేదా మూడు రాజధానుల పేరుతో నిరసనలు తెలిపే కార్యక్రమాలకు ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.