జార్ఖండ్‌లోనూ మ‌హా ట్విస్టులే… సీ ఓట‌ర్ స‌ర్వే ఏం చెప్పిందంటే..

-

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగి నెల రోజులు దాటుతున్నా ఇప్ప‌ట‌కీ ప్ర‌భుత్వం ఏర్పాటు ఒక కొలిక్కి వ‌చ్చింది. ముందుగా బీజేపీ – శివ‌సేన క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండ‌గా… ఆ త‌ర్వాత శివ‌సేన త‌మ‌కు రెండున్న‌రేళ్ల పాటు సీఎం పీఠం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో బీజేపీ ఒప్పుకోలేదు. చివ‌ర‌కు బీజేపీ – ఎన్సీపీని నిలువునా చీల్చి… ఆ పార్టీకి చెందిన అజిత్ ప‌వార్‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇచ్చి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని చూసింది.

అయితే డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన అజిత్ ప‌వార్ రెండు రోజుల‌కే ప్లేటు ఫిరాయించ‌డంతో చివ‌ర‌కు ఎన్సీపీ – శివ‌సేన – కాంగ్రెస్ ఉమ్మ‌డిగా ప్ర‌భుత్వ ఏర్పాటుకు అంగీకారానికి వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు శివ‌సేన అధినేత ఉద్ద‌వ్ థాక్రే మ‌హారాష్ట్ర 18వ సీఎంగా గురువారం ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు. ఇక
జార్ఖండ్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైతం మహారాష్ట్ర త‌ర‌హాలోనే హంగ్ ఏర్పడే అవకాశం ఉందని సి-ఓటర్ ఐఏఎన్ఎస్ ప్రీపోల్ సర్వే అంచనా వేసింది.

జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకు ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఈ నెల 30న ప్రారంభం కానుండగా, చివరి విడత ఎన్నికలు డిసెంబరు 20న జరగనున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ 33-38 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించ‌నుంద‌ట‌. ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు అవసరం కాగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. జేఎంఎంకు 18-28 సీట్లు, జేవీఎం 9, ఏజేఎస్‌యూకు 6, కాంగ్రెస్‌కు 6-9 సీట్లు లభించవచ్చని సర్వే అంచనా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news