ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులలో ఒక రాజధానిగా వైజాగ్ నగరాన్ని గుర్తించడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్టణం నగరాన్ని గుర్తించిన జగన్ ఆ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు. పారిశ్రామికంగా మరియు ఇంకా అనేక రీతులుగా ఆహ్లాదకరమైన పట్టణంగా విశాఖపట్టణం కి మంచి పేరు ముందు నుండి ఉంది. అయితే జగన్ తీసుకున్న నిర్ణయానికి విశాఖపట్టణం లో చాలా పరిశ్రమ రంగ సంస్థలు వస్తాయని భావించిన పెద్దగా రాలేదు.
ఇటువంటి తరుణంలో ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపార రంగంలో అడుగుపెట్టిన మహేష్ బాబు నిర్ణయానికి జగన్ అభిమానులు డాన్సులు వేస్తున్నారు. విషయంలోకి వెళితే మహేష్‌బాబు, ఏషియన్ సినిమాస్‌తో కొలబ్రేట్ అయ్యి ఏఎంబీ సినిమాస్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. హైదరాబాద్‌లో ప్రస్తుతం టాప్ మల్టీప్లెక్స్ అంటే దీని పేరు వినిపిస్తుంది. అద్బుతమైన ఫీచర్స్‌తో పాటు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌కు జనాలు తెగ వెళ్లి పోతున్నారు. భారీగానే లాభాలు కూడా వస్తున్నాయి.
ఇటువంటి నేపథ్యంలో రెండవ ఏఎంబీని వైజాగ్ లో ఏర్పాటు చేయాలని మహేష్ డిసైడ్ అయ్యారట. ఇందుకోసం ప్రస్తుతం విశాఖపట్టణంలో ఒక కమర్షియల్ ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏడాదిలో అంటే వచ్చే వేసవి దసరా వరకు వైజాగ్ ఏఎంబీని ప్రారంభించేలా చకచక పనులు జరిగేలా మహేష్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో వైజాగ్ లో ఎవ్వరూ రావడం లేదు అనుకున్న టైమ్ లో మహేశ్ దిగడం జగన్ కి ఆనందం కలిగించినట్లు సమాచారం.