ఆంబోతులకు భయం ఉండదు, దున్నపోతులకు చలనం ఉండదు: చంద్రబాబు విమర్శల జడివాన

-

వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి ప్రజా చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా, పరుచూరి నియోజక వర్గంలో యాత్ర ప్రారంభించారు. అయితే మార్టూరులో ఆయన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, ఒక్క చాన్స్ అంటే ఓటేశారని, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. 9 నెలల వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. `ఎన్నికల సమయంలో ఒక మాయ మిమ్మల్ని ఆకట్టుకుంది.

వివిధ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మద్దతు ధరల్లేవు, పేదలకు కడుపు నిండా తిండిపెట్టే అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. ప్రజల కోసం పోరాడితే ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించి ఉంటే వీళ్లు పాదయాత్రలు చేసేవాళ్లా? ఈ ఆంబోతులకు భయం ఉండదు, ఈ దున్నపోతులకు చలనం ఉండదు. కానీ ఇలాంటి దున్నపోతుల పొగరు దించే శక్తి ప్రజలకే ఉంది. ప్రజలు సురక్షితంగా ఉండాలంటే రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వీళ్లకు కళ్లెం వేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news