రేవంత్‌రెడ్డి కి స‌పోర్టుగా నిలిచిన మ‌ల్లు ర‌వి.. కేసీఆర్‌పై స్ట్రాంగ్ పంచ్‌!

-

ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాలు హైలెట్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఆ పార్టీకి రేవంత్‌రెడ్డి Revanth Reddy ని ప్రెసిడెంట్ గా నియ‌మించ‌డంతో అందులో కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నా.. మ‌రి కొంద‌రు మాత్రం స‌పోర్టుగా నిలుస్తున్నారు. అయితే దొరికిందే సందు అన్న‌ట్టు అధికార పార్టీ నేత‌లు రేవంత్ పై దారుణంగా సెటైర్లు వేస్తూ విమ‌ర్శిస్తున్నారు. కాగా ఆయ‌న్ను నేత అంటూ ట్రోల్ చేస్తున్నారు.

 రేవంత్‌రెడ్డి/ Revanth Reddy
రేవంత్‌రెడ్డి/ Revanth Reddy

ఇక ఇదే విమ‌ర్శ‌ల‌పై కాంగ్రెస్ నేత మల్లు రవి రేవంత్‌రెడ్డికి అండ‌గా నిలిచారు. టీఆర్ఎస్ మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు స్ట్రాంగ్ పంచ్ విసిరారు. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ వారి నోర్లు మూయించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు టీడీపీ నేత‌గానే ఉన్నార‌ని గుర్తు చేశారు.

ఆ త‌ర్వాతే టీఆర్ఎస్ కు అధ్యక్షుడు అయ్యార‌ని, ఆ విష‌యం గుర్తు చేస్తూ స్ట్రాంగ్ కౌంట‌ర్ విసిరారు మ‌ల్లు ర‌వి. ఇక రేవంత్‌ను విమ‌ర్శిస్తున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి కూడా టీడీపీ నీడ నుంచి వ‌చ్చి టీఆర్ ఎస్ లో చేరార‌ని సెటైర్ వేశారు. ఇక రేవంత్ పై కేసులు ఉన్నాయని చెబుతూ మాట్లాడుతున్నార‌ని, ఆ మాట‌కొస్తే కేసీఆర్ పైన సీబీఐ కేసులు లేవా అంటూ ప్ర‌శ్నించారు. మొత్తాన‌కి మ‌ల్లు ర‌వి రేవంత్‌కు బాగానే స‌పోర్టుగా నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news