ఓటీఎస్ పై టీడీపీ రాద్ధాంతం చేస్తుంది : మంత్రి బొత్స

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శాశ్వ‌త గృహ ప‌థ‌కాన్ని టీడీపీ విమ‌ర్శించ‌డం సిగ్గు చేట‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ అన్నారు. ఓటీఎస్ పై తెలుగు దేశం పార్టీ అన‌వ‌స‌రం గా రాద్ధాంతం చేస్తుంద‌ని మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ విమ‌ర్శించారు. ఓటీఎస్ పై తమ ప్ర‌భుత్వం ఎవ‌రినీ బ‌లవంతం చేయ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. ఈ రోజు మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ బెజ‌వాడలో ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ పై చంద్ర బాబు పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌తి ప‌క్షాలు చేయ‌రు.. త‌మ ప్ర‌భుత్వాన్ని చేయ‌నివ్వ‌రని అన్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లకు ఇళ్ల ప‌ట్టాల‌ను త‌మ ప్ర‌భుత్వం ఇస్తే.. కోర్టుల‌లో టీడీపీ నాయ‌కులు కేసులు వేస్తున్నార‌ని ప్ర‌తి ప‌క్ష‌ల పార్టీ ల‌పై ఆగ్ర‌హించారు. అలాగే త‌మ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీ త‌నంగా ఉంటుందని తెలిపారు. అలాగే ప్ర‌జ‌ల‌ను ప‌న్ను క‌ట్ట‌ద్దు అని చెప్ప‌డానికి అచ్చెన్నాయుడు ఎవ‌రని ప్ర‌శ్నించారు. అచ్చెన్నాయుడు టీడీపీ ప్ర‌భుత్వం పై ఇలా ఎందుకు ప్ర‌శ్నించాల‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని త‌మ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తే ప్ర‌తిప‌క్షం అడ్డు ప‌డుతుంద‌ని అన్నారు.