మంత్రికుమారుడి బర్త్ డే వేడుకలు గులాబీ పార్టీలో కొత్త చిచ్చు రేపాయా ?

-

కొద్దిరోజుల క్రితం రాష్ట్ర మంత్రి ఒకరు తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను చారిత్రక ప్రదేశంలో అట్టహాసంగా నిర్వహించారు. అయితే ఆ వేడుకలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. పుట్టినరోజు వేడుకల్లో నేతల మాటలు,పాటలు జరిగిన పరిణామాలపై పార్టీవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వేడుకల్లో పాల్గొన్న నేతలనుద్దేశించి పార్టీ సమావేశంలో కేసీఆర్ ఘాటైన కామెంట్స్ చేశారా అన్న చర్చ ఇప్పుడు గులాబీ శ్రేణులో నడుస్తుంది.

తెలంగాణలో కీలక మంత్రి కుమారుడి బర్త్‌డే వేడుకలను ఓ చారిత్రక ప్రదేశంలో అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో తప్పేం లేకపోయినా.. వచ్చినవారు పాడిన పాటలు.. అనుకున్న మాటలు చేసిన కామెంట్లే ఇప్పుడు అధికారపార్టీలో కాకపుట్టిస్తున్నాయట. సాధారణంగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ హైదరాబాద్‌ శివారుల్లో కానీ.. ఇంకా గ్రాండ్‌గా చేయాలని అనుకుంటే విదేశాల్లో కానీ ప్లాన్‌ చేసుకుంటారు. ఆ మంత్రి మాత్రం కుమారుడి పుట్టినరోజు వేడుకలకు చారిత్రక ప్రాంతం హంపిన ఎంచుకున్నారు. తనతో సన్నిహితంగా ఉండే ప్రజాప్రతినిధులను..ప్రముఖులను హంపికి ఆహ్వానించారు.

హంపిలో రెండు మూడు రోజుల వరకు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరిగాయట. పుట్టినరోజు వేడుకల వరకే ఆ పర్యటన పరిమితమై ఉంటే పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ.. ఆ సెలబ్రేషన్స్‌కు హాజరైన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు.ఇతరులు వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆ నోటా.. ఈ నోటా చర్చ జరుగుతూ పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లిందని సమాచారం. అక్కడ ఒకరిని టార్గెట్‌ చేస్తూ ఓ ప్రజాప్రతినిధి పాటలు పాడారట. ఆ విషయం ఇప్పుడు గుప్పుమంది. దీని పై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కూడా ఆరా తీసీందట.

హంపి సెలబ్రేషన్స్‌లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆ మధ్య టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ కొన్ని కామెంట్స్‌ చేశారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ ఏర్పాటు అంటే ఆషామాషీ కాదన్న కేసీఆర్‌… పాటలు పాడి.. డ్యాన్స్‌లు చేస్తే సరిపోదన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో అంత అటెన్షన్‌ అయ్యారట. ఎవరిని లక్ష్యంగా చేసుకుని గులాబీ దళపతి ఈ కామెంట్స్‌ చేశారా అని ఒకరి నొకరు చెవులు కొరుక్కుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news