మోడీ – బాబు… ఓ “గో బ్యాక్” స్టోరీ!

-

కాలం చాలా వేగంగా పరిగెత్తుతుంటుంది! కళ్లు మూసి తెరిచేలోపే ఓడలు బళ్లూ, బళ్లు ఓడలూ అయిపోతుంటాయి. ఒకప్పుడు చీ పో అన్నవాళ్లనే .. ప్లీజ్ అనాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కాస్త సిగ్గూ ఎగ్గూ పక్కనపెట్టేస్తే కొన్ని సందర్భాల్లో అవి కూడా తప్పని పరిస్థితులు నేడు!! ఇక రాజకీయాల్లో అంటారా… ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! అక్కడ శాస్వత శతృవులూ శాస్వత మితృలూ ఉండరు! కాకపోతే… అలా అని ఒకవైపే అనుకుంటే మాత్రం అనుకున్నవాళ్లు బకరా అయిపోతారు! ఇలాంటి పరిస్థితే ప్రస్తుతంం చంద్రబాబుకు ఎదురయ్యిందనే చెప్పాలి!!

వాళ్లతో కలవడం చారిత్రక తప్పిదం అన్న పార్టీతోనే చెట్టాపట్టాలేసుకున్న రాజకీయ చరిత్ర బాబు సొంతం. గతంలో బీజేపీతో కలవడంపై అలా స్పందించిన బాబే… 2014 లో మోడీతో కలిసి ప్రయాణించారు… మోడీ పుట్టడం దేశానికి, తాను పుట్టడం ఏపీకి అదృష్టం అన్న రేంజ్ లో ప్రసంగాలు చేశారు! అది గతం… తర్వాత పరిస్థితులు మారాయి… ఏపీకీ మట్టి – నీళ్లు ఇచ్చారని చంద్రబాబు అనడమే కాకుండా.. పాచిపోయిన లడ్లు ఇచ్చారని పవన్ తో కూడా అనిపించేశారు! ఇప్పుడు పవన్ – బీజేపీ అయితే బాగానే ఉన్నారు! కానీ… బాబు ఎంత ప్రయత్నించినా, ఎంత తగ్గినా కూడా మోడీ వైపునుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ వస్తున్నట్లు లేదు! అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి తాజా పరిణామాలు!! ఎందుకంటే.. మోడీ తనకు ఎదురైన అవమానాల విషయంలో అస్సలు మతిమరుపు ప్రదర్శించరంట!

ఇక్కడ విషయం ఏమిటంటే… తాజాగా విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటన ను పరిశీలించడానికో, చూసిరావడానికో తనకు విశాఖ వెళ్లడానికి అనుమతి కావాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు! తన రాష్ట్రానికి తాను వెళ్లడానికి “విశాఖ వెళ్తాను పర్మిషన్ ఇప్పించండి సార్” అంటూ బాబు, ప్రధాని మోడీని కోరడం ఏంటి? ఏ… తప్పేముందు అనుకుంటున్నారా? ఆ కోరేదేదో జగన్ ని కోరితే ఇపాటికి వెళ్లి వచ్చేసేవారు కదా! బాబు అంతలా దిగజారి, అన్నీ పక్కన పెట్టి మోడీ కాళ్ల బేరానికి వెళ్లినంత పని చేసినా కూడా.. ఇప్పటివరకూ బాబు రిక్వస్ట్ కి మోడీ స్పందించలేదు.

ఇక్కడ చిత్రమైన సంఘటన ఏమిటంటే… ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బైటకొచ్చిన సమయంలో మోడీ ఏపీకి వస్తుంటే.. “గో బ్యాక్” అంటూ బ్యానర్లు ప్రదర్శించి, “ఆయన్ని ఏపీలో అడుగు పెట్టనివ్వం” అని చంద్రబాబు ప్రగల్భాలు మామూలుగా పలకలేదు! మోడీని ఏపీలో అడుగుపెట్టనివ్వం అన్నంతగా “గో బ్యాక్” అంటూ హడావిడి చేశారు. విచిత్రం ఏమిటంటే… ఇప్పుడు అదే ఏపీకి చంద్రబాబు వెళ్లడానికి మోడీ పర్మిషన్ కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్నారు! ఇంతకుమించి——–ఏమైనా ఉంటుందా?

జగన్ ని అనుమతి అడగడానికి చంద్రబాబుకి ఈగో అడ్డొస్తుందేమో కానీ… తనకు తానే “గో బ్యాక్” అని నినదించిన మోడీని అడగడానికి మాత్రం చంద్రబాబుకి నామోషీగా లేదు! ఈ సమయంలో కూడా చంద్రబాబుకి జనాలకంటే తన వ్యక్తిగత ఈగోనే ఎక్కువైపోయిందా? తన రాష్ట్రంలో, తన ప్రజలను చూడటానికి కూడా చంద్రబాబు… చకోర పక్షి వర్షం చుక్క కోసం ఆకాశం వైపు చూసినట్లు… మోడీ రిప్లై కోసం చూడటం ఎంతటి దౌర్భాగ్యం! 40ఏళ్ల సర్వీస్ నేర్పింది ఇదేనా? మోడీ 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇస్తే.. అప్పటివరకూ సమస్య అలానే ఉంటుందా? లేక ఉండాలని కోరికా? కరోనా విషయంలో బాబు చేసిన పెద్ద తప్పే.. మళ్లీ విశాఖ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో కూడా చేస్తున్నారు!! కాలం క్షమించదేమో చంద్రబాబు!!

Read more RELATED
Recommended to you

Latest news