ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎవరిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంపిక చేస్తారు అని గత నెల రోజుల నుంచి కొనసాగుతూ వస్తోంది .అయితే రెండు రోజుల క్రితం సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంత్రులు మోపిదేవి వెంకటరమణ ,పిల్లి సుభాష్ చంద్రబోస్ తోపాటుగా ముకేశ్ అంబానీ సూచించిన పరిమళ నత్వాన్ని రాజ్యసభకి వైసీపీ నుంచి సీటు ఖరారు చేశారు .
దీనితో సీటు ఆశిస్తున్న చాలామంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అదేవిధంగా వైయస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల, బీదా మస్తాన్ రావు వంటివారు రాజ్యసభకు వెళ్తారని అనుకున్నారు .ఈ సమయంలోనే సినీ నటుడు మోహన్ బాబు పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. తిరుపతిలో విద్యార్థులతో కలిసి మోహన్ బాబు ధర్నాలు కూడా చేయటం గమనార్హం .
ఆ తర్వాత కూడా చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని కొన్ని విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది పక్కన పెడితే ఆయన రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలను వదిలేస్తా అనే చర్చ రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో కూడా ఎక్కువగా జరుగుతోంది. రాజ్యసభ సీటు కావాలని భావించిన మోహన్ బాబు ఢిల్లీ వెళ్లి కుటుంబసమేతంగా ప్రధాని నరేంద్ర మోడీ తో కూడా సమావేశమయ్యారు. ముందు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ బాబుకి రాజ్యసభ ఇవ్వాలనే భావించారు .ఏమైందో ఏమో తెలియదు కానీ మోహన్ బాబుని అనూహ్యంగా పక్కన పెట్టారు. జగన్ మరి దీంతో ఇప్పుడు మోహన్ బాబు రాజకీయాల్లో ఉంటారా లేక రాజకీయాలను వదిలేసి వెళ్లిపోతారా అనేది చర్చనీయాంశంగా మారింది.